India-China relation: భారతదేశం పట్ల చైనా తీరు ఆందోళనకరంగా మారుతోందని భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్. జయశంకర్ అన్నారు. చైనా, భారత సరిహద్దుల్లో చోటుచేసుకున్న పలు అంశాలపై కీలక వ్యాఖ‍్యలు చేశారు. చైనాతో భారత్ సమస్యలు ఎదుర్కొంటోందని, భారత్ తో చైనా చేసుకున్న రాతపూర్వక ఒప్పందాలను చైనా ఉల్లంఘిస్తుందనీ, ఈ కారణంగానే సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయని అన్నారు.
India-China relation: భారతదేశం పట్ల చైనా తీరు ఆందోళనకరంగా మారుతోందని భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్. జయశంకర్ అన్నారు. చైనా, భారత సరిహద్దుల్లో చోటుచేసుకున్న పలు అంశాలపై కీలక వ్యాఖ‍్యలు చేశారు. చైనాతో భారత్ సమస్యలు ఎదుర్కొంటోందని, భారత్ తో చైనా చేసుకున్న రాతపూర్వక ఒప్పందాలను చైనా ఉల్లంఘిస్తుందనీ, ఈ కారణంగానే సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. ప్రస్తుతం చైనాతో భారత్ సంబంధాలు చాలా క్లిష్ట దశలో ఉన్నాయనీ, భారత్ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నదని తెలిపారు.
గతంలో కూడా జైశంకర్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ (MSC) 2022 ప్యానెల్ సమావేశంలో జైశంకర్ మాట్లాడుతూ.. 45 సంవత్సరాలుగా ఎలాంటి సరిహద్దు సమస్యలూ లేవని, శాంతి యుతంగా, సుస్థిరంగా సరిహద్దు నిర్వహణ జరిగిందని,1975 నుండి సరిహద్దులో ఎలాంటి సైనిక మరణాలు లేవనీ, కానీ, ఇప్పుడు పరిస్థితి మారిందని, వాస్తవ నియంత్రణ రేఖ విషయంలో కుదుర్చుకున్న ఒప్పందాలను చైనీయులు ఉల్లంఘిస్తున్నారని జైశంకర్ విరుచుకుపడ్డారు.
సరిహద్దుల్లో పరిస్థితి ఇలానే వుంటే.. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత కష్టతరంగా మారాయనీ, ప్రస్తుతం చైనాతో సంబంధాలు చాలా కష్టతరమైన దశలో ఉన్నాయని విదేశీ వ్యవహారాల మంత్రి అన్నారు, జూన్ 2020 కంటే ముందు కూడా పశ్చిమ దేశాలతో భారతదేశ సంబంధాలు చాలా మర్యాదపూర్వకంగా ఉన్నాయని అన్నారు.
పాంగోంగ్ సరస్సు ప్రాంతాల్లో హింసాత్మక ఘర్షణ తర్వాత భారతదేశం మరియు చైనా మిలిటరీల మధ్య తూర్పు లడఖ్ సరిహద్దులో ప్రతిష్టంభన చెలరేగింది. ఈ క్రమంలో చైనా పదివేల మంది సైనికులు, భారీ ఆయుధాలతో సరిహద్దులో మోహరించాయని తెలిపారు. జూన్ 15, 2020న గాల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణ ఉద్రిక్తత గా మారిందని తెలిపారు.
పరిస్థితి కూడా అలాగే .. అందులో పెద్ద మార్పేమీ ఉందని, ఇది సహజ స్థితేనని జైశంకర్ చైనాకు చురకలంటించారు. ఈ కారణాల రీత్యానే ప్రస్తుతం చైనాతో భారత సంబంధాలు క్లిష్ట పరిస్థితుల్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు. భారత్ సరిహద్దులో బలగాల మోహరింపు చేయకూడదని చైనాతో ఒప్పందం ఉందని, చైనా ఆ ఒప్పందాలను పక్కన పెట్టి ప్రవర్తిస్తే.. అంతే స్థాయి ఉద్రిక్తతలు తలెత్తాయని ఆయన వివరించారు. ఒప్పందాలను తుంగలో తొక్కేస్తే.. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజమే దృష్టి సారించాలని జైశంకర్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై నాటో దేశాలు, రష్యా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతపై విస్తృతంగా చర్చించడానికి ఉద్దేశించిన మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ (MSC) 2022 ప్యానెల్ సమావేశమైంది.
