ఇండియాలో ఆగని కరోనా ఉధృతి: మొత్తం 49 లక్షలు దాటిన కేసులు
భారత్ లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 83,808 మందికి కరోనా సోకింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 49 లక్షల 30 వేల 236కి చేరుకొన్నాయి.
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 83,808 మందికి కరోనా సోకింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 49 లక్షల 30 వేల 236కి చేరుకొన్నాయి.
సోమవారం నాడు 10,72,845 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 83,808 మందికి కరోనా సోకినట్టుగా కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు దేశంలో 5 కోట్ల 83 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
కరోనాతో సోమవారం నాడు ఒక్కరోజే 1054 మంది మృతి చెందారు. దేశంలో కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 80,776కి చేరుకొంది. కరోనాతో మరణించినవారిలో అత్యధికులు కరోనాతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
కరోనా సోకిన రోగుల్లో 78 శాతం రికవరీ ఉన్నట్టుగా కేంద్రం తెలిపింది. రికవరీ రేటు మెరుగ్గా ఉండడం కాస్త ఉపశమనం కల్గిస్తోంది.కరోనాతో మరణించిన వారి సంఖ్య 1.64 శాతంగా ఉన్నట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
కరోనా కేసుల్లో ప్రపంచంలో అమెరికా ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో ఇండియా నిలిచింది. అమెరికాలో గతంతో పోలిస్తే రోజు రోజు కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య తగ్గింది. ఇండియాలో మాత్రం గతంతో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ వస్తోంది.ప్రతి రోజూ 90 వేలకు పైగా కరోనా కేసులు నమోదుకావడం ఆందోళన కల్గిస్తోంది.