Asianet News TeluguAsianet News Telugu

పుట్టిన గడ్డతో భారతీయ ముస్లింలది భావోద్వేగ సంబంధం.. సాంస్కృతికంగా పెనవేసుకున్నారు!

భారత ముస్లింలు పుట్టిన గడ్డ, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలతో మమేకమై ఉన్నారు. ఒక ఉద్వేగభరిత సంబంధాన్ని కలిగి ఉన్నారు. అందుకే వారు హింసకు దూరంగా, తీవ్రవాదానికి దూరంగా ఉంటారు.
 

indian muslims have stong attachment with their land through culture and emotions kms
Author
First Published Jun 9, 2023, 5:07 PM IST

2003 నవంబర్‌లో ఓ కార్యక్రమంలో ప్రజాస్వామ్యం గురించి అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ జూనియర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం, బహుళ మత సమాజాన్ని నిర్మించడంలో భారత అద్భుత పాత్ర పోషించిందని అన్నారు. భారత ముస్లింలు ప్రజాస్వామ్యంతో మమేకం కాగలరని నిరూపించారు. భారతీయ ముస్లింలు అల్ ఖైదా నెట్వర్క్‌లో ఒక్కరూ చేరలేదనీ ఆయన ఓ చోట అన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్ అల్లర్ల తర్వాత వారిని రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగినా విఫలమయ్యాయని పేర్కొన్నారు. 

అంతకు ముందు కూడా భారతీయ ముస్లింలు 1980లో అఫ్ఘానిస్తాన్‌‌లో సోవియేట్ సేనపై పోరాడిన ముజాహిదీన్‌లోనూ చేరలేదు. భారత సంస్కృతి, ప్రజాస్వామ్యంలో ముస్లింల పాత్ర సంక్టిష్టమైనదైనా.. ఆసక్తికరమైనది. భారత్‌లోని ముస్లింల జనాభా పాకిస్తాన్, ఇండోనేషియాలోని జనాభాకు సమానం. విదేశాలతో యుద్ధాల్లో మునిగి ఉన్న పశ్చిమాసియా పౌరులతో పోల్చితే భారతీయుల సంఖ్య శూన్యంగా చెప్పవచ్చు. 

భారత ముస్లింలు గ్లోబల్ టెర్రరిజాన్ని వ్యతిరేకించారు. దీనికి కారణం భారత సమాజం, సంస్కృతిలో మనకు లభిస్తుంది. ఇస్లాం ఆధారంగా విడిపోయిన పాకిస్తాన్‌లోని ముస్లింలతో సమానంగా భారత్‌లోనూ ముస్లింలు ఉన్నారనే విషయయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. ఇండియాలోనే ఉండిపోవాలనుకున్న ముస్లిం నిర్ణయాల వెనుక కొన్ని లాజిక్‌లు ఉండొచ్చు.

కచ్చితంగా ముస్లింలు తమ దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిఘాతక ఉగ్రవాద వ్యూహాలు రచించేవారు ఇక్కడ ముస్లింలును వారి భూమితో బలంగా కట్టివేసి ఉంచిన సాంస్కృతిక, భావోద్వేగ కారణాలను అర్థం చేసుకోవాలి.

వారిలో కొన్ని తీవ్రవాద శక్తులు ఉండొచ్చు. కానీ, అవి చాలా పరిమితంగానే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారీ మొత్తంలో దుందుడుకుతో ఢీ కొట్టడానికి వెళ్లుతుండగా.. భారత ముస్లిం మాత్రం అలాంటి యుద్ధాలకు దూరంగా ఉన్నారు. మన దేశ న్యాయవ్యవస్థ, బాధ్యతయుత పౌరులు ఈ అతివాదాన్ని నిరోధిస్తున్నారు.

indian muslims have stong attachment with their land through culture and emotions kms

బహుళత్వాన్ని భారత ముస్లింలు తమలో నింపుకున్నారు. మొహమ్మద్ రఫీ లాంటి సిగర్‌లు మన్ తడ్పత్ హరి దర్శన్ కో ఆజ్ వంటి పాటలు కేవలం భారత దేశంలోనే పాడగలరు. ఈ లిరిక్స్ షకీల్ బదాయుని రాశారు. మహాభారత వంటి ప్రజాదారణ పొందిన సీరియల్ రహి మాసూమ్ రాశారు. జయాసి, రస్కాన్ వంటి కవులు మన వారసత్వ సంపద.

అయినా కొందరిలో ముస్లింల దేశ భక్తిపై అనుమానాలు ఉన్నాయి. వారికి, చాలా మంది ముస్లింలకు కూడా కొన్ని ముఖ్యమైన వాస్తవాలు తెలియవు. 

సారే జహాన్ సే అచ్చా అనే గీతాన్ని ఇక్బల్ రాశారు. బ్రిటీష్ క్విట్ ఇండియా, సైమన్ గో బ్యాక్ వంటి స్లోగన్లు యూసుఫ్ మెహెరాలి ఇచ్చారు. నేతాజీ ప్రసంగంలో జై  హింద్ అని నినదించారు. దాన్ని ఆజాద్ హింద్ ఆర్మీకి కమాండర్‌గా ఉన్న జైన్ ఉల్ అబిదిన్ హసన్ తొలిగా ఇచ్చారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే పాపులర్ స్లోగన్ మౌలానా హస్రత్ మొహానీ ఇచ్చారు.

భారత స్వాతంత్ర్య సమరంలో ముస్లింల పాత్ర గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన పని లేదు. 1857 తొలి స్వతంత్ర సంగ్రామం హిందువు, ముస్లింలు కలిసి ముఘల్ పాలకుడు బహదూర్ షా జాఫర్ నాయకత్వంలో పోరాడారు.

1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ రెండేళ్ల తర్వాత బద్రుద్దీన్ తయ్యబ్జీ దాని అధ్యక్షుడయ్యా డు. ఆయన సోదరుడు కమరుద్దీన్ తయ్యబ్జీ ఇందులో పాల్గొన్నాడు. ఈ సంప్రదాయం మౌలానా ఆజాద్, ఎంసీ చగ్లా, హుమాయున్ కబీర్, జాకిర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ నుంచి ఏపీ అబుల్ కలాం వరకు సాగింది. కేవలం లీడర్లే కాదు.. మెజార్టీ ముస్లింలు జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారు.

క్రీడలు, సాంస్కృతిక అంశాల్లోనూ ముస్లింల జీవితాల్లోనూ అందరికీ తెలిసిందే. 1932లో ఇండియన్ క్రికెట్ టీమ్ ఆడటం మొదలు పెట్టింది. ఫస్ట్ టీమ్ ఇంగ్లాండ్‌తో ఆడగా.. అందులో మొహమ్మద్ నిసర్, వాజిర్ అలీ, నజిర్ అలీ, జహంగీర్ ఖాన్‌లు కూడా ఈ టీమ్‌లో ఉన్నారు. అప్పటి నుంచి ఇఫ్తికర్ పటౌడీ, మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, గులాం అహ్మద్, ముహమ్మద్ అజరుద్దీన్‌లు టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత కూడా చాలా మంది టీమ్‌లో ఆడారు. ఉదాహరణకు ముష్తక్ అలీ, సలీం దుర్రానీ, అబ్బాస్ అలీ బేగ్, సయ్యద్ కిర్మాని, జహీర్ ఖాన్, మొహమ్మద్ కైఫ్, మొహమ్మద్ షమీ, ఇర్ఫాన్ పఠాన్‌లు ఉన్నారు.

indian muslims have stong attachment with their land through culture and emotions kms

దిలీప్ కుమార్, మధుబాల, మీనా కుమారి, నౌషద్, గులాం అలీ ఖయ్యం, నసీరుద్దీన్ షా, ఆమిర్, షారుక్, సల్మాన్ ఖాన్ ఇంకా ఎందరో హిందీ సినిమాకు కృషి చేశారు. 

ఇస్లాం ఔట్‌లుక్ యూనివర్సల్. దియోబందీ, బరేల్వి ఆలోచనలు స్వదేశీయం. జమాత్ ఇస్లామీ, తబ్లిగీ జమాత్‌లతో ఈ ఆలోచనలు పరిఢవిల్లాయి. భారత వాతావరణంలో అభివృద్ధి చెందాయి. పశ్చిమాసియా ప్రభావం వీటిపై దాదాపు లేదు. 

దేశ విభజన తర్వాత భారత్‌లో ముస్లింల ప్రాధాన్యత, వారి పాత్ర గురించిన చర్చ మళ్లీ మొదలైంది. ఇది వారిని ఆధునిక విషయాలు నేర్చుకోవడంలో, ప్రధాన స్రవంతిలో కలవడంలో ఉపకరిస్తుంది. 

కచ్చితమైన సమాచారం లేకున్నా.. పాకిస్తాన్‌లోని ముస్లింలను అడిగితే.. దేశ విభజన ఒక తప్పిదం అనే అభిప్రాయపడతారని అనుకుంటున్నాను. వెళ్లిపోయిన వారిని వదిలిపెట్టండి. కానీ, మనం ఇప్పటికీ పొరుగువారిగా ఉండొచ్చు. 60వ దశకంలో ముస్లింలు లాహోర్‌ నుంచి అమృత్‌సర్‌కు వచ్చి ముఘల్ ఆజాం సినిమా చూసి వెళ్లేవారు.

1965 వరకు భారత్, పాకిస్తాన్‌ల మధ్య సత్సంబంధాలు సాగాయి. ఎప్పుడైతే ఆపరేషన్ జిబ్రాల్టర్ మొదలైందో.. అప్పటి నుంచి సమీకరణాలు మారిపోయాయి. నేడు కఠినమైన వీసా నిబంధనలతో ఉభయ దేశాల మధ్య పౌరుల ప్రయాణాలు కష్టతరంగా మారిపోయాయి. 

ఇండియా, పాకిస్తాన్ భిన్నమైన దేశాలు. వీటి మధ్య మంచి సంబంధాలు ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ రెండు దేశాల మధ్య బువ్వ, బిడ్డ వంటి సంబంధం ఉన్నది. ఈ రెండు దేశాల్లో ఎక్కడైనా ఉగ్రవాద ఘటన జరిగినప్పుడు ఈ కుటుంబాలు తల్లడిల్లిపోతాయి.

Also Read: 75 ఏళ్ల సాంప్రదాయం.. హజ్రత్ నిజాముద్దీన్ దర్గాలో ఖవ్వాలీ పాడుతున్న నిజామీ కుటుంబం

ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన నూతన పార్లమెంటులో అఖండ భారత్ మ్యూరల్ ఉన్నది. దీనికి పాకిస్తాన్ అధికారికంగా నిరసన తెలిపింది. అఖండ భారత్ అనేది ఒక సాంస్కృతిక విషయం. కొంతమంది రాజకీయ అభిలాష భారత్ యొక్క అఖండ భారత్ చుట్టూ ఉన్నాయోమో, కానీ, వాస్తవమేమిటంటే.. భారత్, పాకిస్తాన్‌లు భిన్నమైన దేశాలు.

పాకిస్తాన్ మ్యాప్‌లో తక్షిలను చూపెట్టడం కూడా ఒక సాంస్కృతి సంబంధాన్ని గుర్తించడమే. ఎందరో పాకిస్తాన్ స్కాలర్లు గత చరిత్రతో కనెక్ట్ అవుతారు, అంతకు మించి ఏమీ లేదు.

2015లో ఐఎస్ఐఎస్ సిరియా, ఇరాక్‌లలో ప్రబలుతున్నప్పుడు 100 మంది భారత ముస్లింలు అందులో చేరినట్టు వార్లు వచ్చాయి. భారత్‌లో ముస్లిం జనాభా 18 కోట్లు అనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. 155 మంది భారతీయులను అరెస్టు చేిసనట్టు వార్తలు వచ్చాయి. ఈ సంఖ్యను పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 85 దేశాల నుంచి 30 నుంచి 40 వేల మంది అందులో చేరారు. యూరప్ నుంచే 4 వేల మంది, అందులో కేవలం ఫ్రాన్స్ నుంచే 1700 మంది ఉన్నారు. ఇండియా కంటే కూడా మాల్దీవుల నుంచి ఎక్కువ మంది సాయుధులు ఉన్నారు.

భారత మాజీ దౌత్యవేత్త తల్మిజ్ అహ్మద్ ప్రకారం, భారత ముస్లింలు ఉగ్రవాద భావజాలాన్ని తిరస్కరించారు. వారు నివసిస్తున్న గంగా జమునా వాతావరణాన్ని వారు ప్రేమిస్తారు. యూఎస్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ సెక్రెటరీ డేవిడ్ హేమాన్ ప్రకారం, భారతీయ ముస్లింలు ఆ దేశ బహుళత్వ సంస్కృతిని వెల్లడిస్తుంది.

భారతీయ ముస్లింలు అత్యధికంగా, భారత పరిస్థితులకు అనుగుణంగా పరిణామం చెందిన సూఫీ సాంప్రదాయాలకు చెందినవారే. దేశంలోని భక్తి ఉద్యమంతో మమేకమైన సూఫీ ఆలోచనలు ఒక కొత సంస్కృతిని ముందుకు తెచ్చింది. 

వీటన్నింటికితోడు భారత ముస్లింల ఆర్థిక స్థితిగతులు కూడా పెద్ద కారణమే. వారు తమ బతుకుదెరువును నమ్ముకుని హింసకు దూరంగా ఉంటున్నారు. భారత సమాజ సంప్రదాయాలు, కుటుంబ విలువలు ముఖ్యమైనవి. వారిపై కుటుంబ బాధ్యత ఉంటుంది. పశ్చిమాసియా పౌరులు టర్కీ, ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ ప్రయాణించడం సులువే కానీ, భారతీయులకు అంత సులభం కాదు.

మీడియా కోణంలోనూ దీన్ని చూడండి. భారత ముస్లింల ముందు ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ, భారత దేశం, రాజ్యంపై వారికి ప్రగాఢ విశ్వాసం ఉన్నది. ఈ విశ్వాసాన్ని కాపాడటంలో మీడియాకూ పాత్ర ఉన్నది. ఈ పాత్రను మెరుపర్చాల్సిన అవసరం ఉన్నది.

 

---- ప్రమోద్ జోషి

Follow Us:
Download App:
  • android
  • ios