భారత్-పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరుదేశాలు సరిహద్దులపై డేగ కన్ను వేశాయి. ఈ క్రమంలో పాకిస్తాన్‌కు చెందిన ఓ డ్రోన్‌ను భద్రతా బలగాలు కూల్చివేశాయి. రాజస్ధాన్‌లోని బికనీర్ నల్ సెక్టార్‌లోకి ఓ గుర్తు తెలియని డ్రోన్ ప్రవేశించినట్లు భారత వైమానిక దళ రాడార్ల ద్వారా భద్రతా సిబ్బంది దానిని గుర్తించారు.

దీనిపై అప్రమత్తమైన సైన్యం సోమవారం ఉదయం 11.30 గంటలకు సుఖోయ్ 30 ఏంకేఐ ద్వారా ఆ డ్రోన్‌ను కూల్చేసింది. కాగా బాలాకోట్‌పై సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత రోజు గుజరాత్‌లోని కచ్ అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలోని నలియా ఎయిర్‌బేస్‌కు సమీపంలో  పాకిస్తాన్‌కు చెందిన డ్రోన్‌ను భారత సైన్యం కూల్చివేసిన విషయం తెలిసిందే.