గాంధీనగర్: కరోనా టీకా తయారీలో భారతదేశం యొక్క స్వావలంభన మొత్తం ప్రపంచానికి ప్రయోజనకరంగా మారిందని ప్రధాని మోడీ చెప్పారు.

శుక్రవారం నాడు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లోని సబర్మతి ఆశ్రమం నుండి దండి వరకు నిర్వహించే పాదయాత్రను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.ఇవాళ మనం సాధించిన విజయం ప్రపంచమంతా వెలుగు చూపిస్తున్నాయని ఆయన చెప్పారు.


ఈ సందర్భంగా ఆయన నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. స్వాతంత్ర్య పోరాటంలో దేశాన్ని ముందుండి నడిపించిన ప్రతి ఒక్కరి పాదాలకు తాను నమస్కరిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.స్వాతంత్ర్యం యొక్క అమృత్ మహోత్సవ్ అంటే స్వేచ్ఛ శక్తి యొక్క అమృతంగా ఆయన పేర్కొన్నారు. అమృత్ ఫెస్టివల్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటే కొత్త ఆలోచనల అమృతంగా ఆయన చెప్పారు.

ఉప్పును దాని ధరతో ఎన్నడూ విలువైనదిగా చెప్పలేదన్నారు. ఇక్కడ ఉప్పు అంటే మనకు నిజాయితీ, నమ్మకం, విధేయతగా ఆయన తెలిపారు.  ఉప్పు మనలో శ్రమకు, సమానత్వానికి ప్రతీకగా పేర్కొన్నారు.  ఆ స్వాతంత్ర్య పోరాట సమయంలో ఉప్పు దేశం యొక్క స్వావలంభనకు చిహ్నంగా ఆయన గుర్తు చేశారు.

భారతదేశ విలువలతో పాటు ఈ స్వావలంభనను బ్రిటీష్ వాళ్లు దెబ్బతీశారని మోడీ చెప్పారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మోడీ ఈ సందర్భంగా ప్రస్తావించారు.