భారత తొలి మహిళా డీజీపీ కంచన్ చౌదరి భట్టాచార్య(72) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం అర్థరాత్రి కన్నుమూశారు. ఆమె గత ఆరు నెలలుగా ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా... సోమవారం రాత్రి ఆరోగ్యం విషమించడంతో ఆమె తుదిశ్వాస విడిచినట్లు పోలీసులు తెలిపారు.

మంగళవారం సాయంత్రం ముంబయిలో కంచన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. కంచన్ మృతి పట్ల  ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పలువురు పోలీసు అధికారులు విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె చేసిన సేవలను కొనియాడారు.

కంచన్ స్వస్థలం హిమాచల్ ప్రదేశ్. 1973 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన కంచన్ 2004లో ఉత్తరాఖండ్ డీజీపీగా బాధ్యతలు చేపట్టి తొలి మహిళా డీజీపీగా అరుదైన ఘనత సాధించారు. 2007 అక్టోబర్ 31వ తేదీన ఆమె పదవీ విరమణ చేశారు. అనంతరం 2014 లో జరిగిన ఎన్నికల్లో ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు.