Asianet News TeluguAsianet News Telugu

Covid 19 : కొత్త కేసుల్లో తగ్గుదల.. కానీ, మరణాల సంఖ్యలో...

తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.32 కోట్లు దాటింది. ఇక మరో సారి కొత్త కేసుల కంటే  రికవరీలా సంఖ్య  తక్కువగా ఉండడం గమనార్హం.  నిన్న 32వేల 198 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.  ఇప్పటి వరకు 3.23 కోట్ల మంది కోవిడ్ ను జయించారు. రికవరీరేటు  97.49 శాతంగా ఉంది.  

India Reports Over 33K New Covid Cases, 308 Deaths
Author
Hyderabad, First Published Sep 11, 2021, 11:16 AM IST

ఢిల్లీ : దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. అయితే రెండు రోజులుగా కొత్త కేసులు మళ్లీ తగ్గుముఖం పట్టడం కాస్త ఊరటనిస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 15.92 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 33,3376 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.  అటు కరోనా విజృంభణ ఎక్కువగా ఉన్న కేరళలోనూ కేసులు కాస్త తగ్గాయి.  నిన్న ఆ రాష్ట్రంలో 25 వేల కొత్త కేసులు వెలుగు చూశాయి.

తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.32 కోట్లు దాటింది. ఇక మరో సారి కొత్త కేసుల కంటే  రికవరీలా సంఖ్య  తక్కువగా ఉండడం గమనార్హం.  నిన్న 32వేల 198 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.  ఇప్పటి వరకు 3.23 కోట్ల మంది కోవిడ్ ను జయించారు. రికవరీరేటు  97.49 శాతంగా ఉంది.  

పది మంది భార్యలు.. ఒక్కో నగరంలో ఒక్కొక్కరిని ఉంచి..

ప్రస్తుతం  3,91,516 మంది వైరస్ తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.18 శాతంగా ఉంది. మరోవైపు మరణాల సంఖ్య మరోసారి 300 దాటింది.  24 గంటల వ్యవధిలో 308 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఒక్క కేరళలోనే ఈ సంఖ్య 177 గా ఉంది.  కరోనా దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటి వరకు  4,42,317 మందిని మహమ్మారి పొట్టనపెట్టుకుంది. 

మరోవైపు దేశంలో  వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న మరో 65.27 లక్షల మందికి టీకాలు వేశారు. ఇప్పటి వరకు 73.05 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios