Asianet News TeluguAsianet News Telugu

Mumbai: వామ్మో.. ముంబ‌యి.. సోమాలియా దేశంలో కలిసి పోనుంద‌ట !

Mumbai: దేశ ఆర్థిక రాజధాని ముంబయి భూభాగం.. భవిష్యత్తులో ఆఫ్రికా దేశం సొమాలియా భూభాగంతో కలిసిపోతుంద‌ట‌. న‌మ్మ‌శ‌క్యంగా లేక‌పోయిన ఇది జ‌రుగుతుంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.  రాబోయే కాలంలో భూమి అనేక మార్పుల‌కు లోన‌వుతుంద‌ని ఈ క్ర‌మంలోనే భూభాగాలు మార్పుల‌కు గుర‌వుతాయ‌ని సైంటిస్టులు  పేర్కొంటున్నారు. 
 

India on a collision course to Madagascar, Somalia; Know what happens to Mumbai!
Author
Hyderabad, First Published Jan 14, 2022, 2:57 PM IST

Mumbai: ఈ విశ్వంలో చోటుచేసుకున్న అనేక మార్పులు కార‌ణంగా భూమి ఏర్ప‌డింద‌నీ, భూమి కూడా మార్పుల‌కు గుర‌వుతున్న‌ద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఈ అనంత విశ్వంలో భూమి ఏర్ప‌డిన స‌మ‌యంలో భూభాగం ఒక్కటిగానే ఉంద‌ని ఇప్పిటికే ప‌లు ప‌రిశోధ‌న పత్రాలు పేర్కొన్నాయి. మిలియ‌న్ సంత్స‌రాల కింద‌ట ఒక్క‌టిగానే ఉన్న భూమి మార్పుల‌కు గురై వేర్వేరు ఖండాలుగా విడిపోయింద‌ని scientists చెబుతున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం భూమి కింద ఉన్న టెక్టోనిక్ ప్లేట్స్ నిరంతరం కదులుతూ వేరుపడ‌ట‌మేన‌ని అంటున్నారు. అయితే, రాబోయే కాలంలో మ‌ళ్లీ ఈ ఖండాలన్నీ ఒకే భూభాగంగా కలిసిపోతాయని తాజాగా మ‌రో పరిశోధన పేర్కొంది.  భౌగోళిక మార్పులపై జరిగిన పరిశోధనలో పలు ఆసక్తికర విషయాలు వెల్ల‌డించారు సైంటిస్టులు. ఇందులో ప్ర‌స్తావించిన ప‌లు విష‌యాలు న‌మ్మ‌శ‌క్యంగా లేక‌పోయిన భ‌విష్య‌త్తుల మాత్రం జ‌రిగి తీరుతాయ‌ని పేర్కొంటున్నారు. దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యి (Mumbai) భూభాగం.. ఆఫ్రికాదేశ‌మైన సోమాలియా భూభాగంతో క‌లిసి పోతాయ‌ని ‘అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ సైన్స్‌’లో ప్రచురించ‌బ‌డిన ఈ నివేదిక పేర్కొంది. ఉట్రెచ్ట్ యూనివర్సిటీకి చెందిన జియాలజిస్ట్ ప్రొఫెసర్ డౌవుయి వాన్ హిన్స్‌బెర్గన్ ఈ పరిశోధన పత్రాన్ని ప్రచురించారు.

భౌగోళిక మార్పుల‌పై జ‌రిపిన ఈ ప‌రిశోధ‌న మ‌రిన్ని వివ‌రాలు ఇలా ఉన్నాయి.  దేశ ఆర్థిక రాజధాని ముంబయి (Mumbai) భూభాగం.. భవిష్యత్తులో ఆఫ్రికా దేశం సొమాలియా భూభాగంతో కలిసిపోతుందని అధ్యయన నివేదిక పేర్కొంది. దాదాపు 250 మిలియన్‌ సంవత్సరాల కిందట భూమి ఏర్పడినప్పుడు పాంగేయా అనే ఒకే ఒక్క ఖండం మాత్రమే ఉండేద‌ని ఈ నివేదిక తెలిపింది. అయితే, ఒక్క‌టిగా ఉన్న భూమి.. తర్వాత 50 మిలియన్‌ సంవత్సరాలకు ఇది చీలి గొండ్వానా, లారేసియా అనే రెండు ఖండాలుగా ఏర్పడింద‌నీ...  ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, భారత్‌ గొండ్వానా ఖండంలో భాగంగా ఉండేవి. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఈ ఖండంలోని ఆఫ్రికా తూర్పు భూభాగంలో మార్పులు చోటుచేసుకున్నాయ‌ని ఈ అధ్య‌య‌నం వెల్ల‌డించింది. ఈ చీలిక‌లు  భూమి కింద ఉన్న టెక్టోనిక్ ప్లేట్స్ నిరంతరం కదులుతూ వేరుపడ‌టం కార‌ణంగా చోటుచేసుకున్నాయ‌ని తెలిపింది. ఇలా మార్పులు చోటుచేసుకుంటున్న క్ర‌మంలోనే భార‌త్ ఉప‌ఖండం లారేసియాలోని ఆసియా ఖండంలో అంతర్భాగం అయింద‌ని తెలిపింది. 

భూమి కింద ఉన్న టెక్టోనిక్ ప్లేట్స్ ఇలా నిరంతరం కదులుతూ వేరుపడ‌టం కార‌ణంగా.. కాల‌క్ర‌మంలోనే ఏడు ఖండాలుగా భూభాగాలు విడిపోయాయి. ఇలా విడిపోయి నేటి ఏడు ఖండాలు.. అనేక దేశాలు ఏర్ప‌డ్డాయి. అయితే, ఇప్ప‌టికీ భూమి కింద ఉన్న టెక్టోనిక్ ప్లేట్స్ క‌దులుతున్నాయ‌నీ, అన్ని ఖండాల భూభాగాలు నెమ్మదిగా కదులుతూ మరో చోటుకు ప్రయాణిస్తున్న‌ట్టు తాము గుర్తించామ‌ని ఈ అధ్య‌య‌న ప‌రిశోధ‌కులు  వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఇలా నెమ్మ‌దిగా క‌దులుతున్న భూభాగాలు..  రాబోయే కాలంలో భారత పశ్చిమ ప్రాంతంలోని దేశ ఆర్థిక రాజ‌ధాని న‌గ‌రం  ముంబయితో తూర్పు ఆఫ్రికాలోని పర్వతాలు, మడగాస్కర్, సొమాలియా రాజధాని మొగదిషు కలిసిపోతాయని శాస్త్రవేత్తలు (scientists) అంచనా వేస్తున్నారు. ఈప‌రిణామాలు చోటుచేసుకుంటున్న క్ర‌మంలో ఇరు ప్రాంతాల మధ్య ఉన్న అరేబియా సముద్రం ఉనికి కోల్పోతుందని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. దీని కారణంగా ముంబయి నగరానికి సముద్ర తీరమే ఉండదని వెల్ల‌డిస్తున్నారు.

ముంబ‌యి స‌ముద్ర తీరప్రాంత‌మైన పశ్చిమ కోస్తాతీరాన్ని మొగదిషు పర్వతాలు వచ్చి చేరుతాయ‌ని చెబుతున్నారు.  ముంబయి, మొగదిషు పొరుగు ప్రాంతాలుగా మారడంతో పాటు కోల్‌కతా, మారిషస్‌లు కూడా ఒకదానికొకటి దగ్గరగా వస్తాయని వివరించారు. భారత ఉపఖండంలో ఉన్న శ్రీలంక అంతరించిపోతుందని చెబుతున్నారు. అయితే, ఈ ప‌రిణామాలు చోటుచేసుకోవ‌డానికి ..దాదాపు 200 మిలియన్ సంవ‌త్స‌రాలు ప‌డుతుంద‌ని చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios