Asianet News TeluguAsianet News Telugu

ఊపీరి పీల్చుకోండి.. డిసెంబర్ నాటికే కరోనా వ్యాక్సిన్

కరోనా వైరస్‌ను ఈ టీకా సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు వెల్లడైతే.. అత్యవసర అనుమతి కింద బిలియన్‌ (వంద కోట్ల) డోసులను డిసెంబర్‌ నాటికి ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు.

India may get 100 million doses of AstraZeneca's COVID-19 vaccine by Dec 2020
Author
Hyderabad, First Published Nov 14, 2020, 3:23 PM IST

కరోనా మహమ్మారి భారత్ ని అతలాకుతలం చేసేసింది. ఈ మహమ్మారి కారణంగా మాస్క్ లేకుండా ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టలేని  పరిస్థితి. కనీసం ప్రశాంతంగా ఊపిరి కూడా పీల్చుకోకుండా చేసేసింది. అయితే.. మరికొద్ది రోజుల్లో ఈ పరిస్థితిలో మార్పు రానుంది. డిసెంబర్ నాటికి భారతీయులకు వ్యాక్సిన్ అందజేయడానికి అస్ట్రాజెన్ కా ప్రయత్నిస్తోంది.

డిసెంబర్ నాటికి భారత్‌లో 10 కోట్ల డోస్‌ల కోవిడ్‌  వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆస్ట్రాజెన్‌కా వెల్లడించింది.  ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకాలు భారత్‌లో సంయుక్తంగా తయారు చేస్తోన్న 'అస్త్ర జెనికా' అనే కరోనా వ్యాక్సిన్‌‌ను ఉత్పత్తి చేస్తోన్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఆస్ట్రాజెన్‌కా టీకా చివరి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయని  సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అదార్‌ పూనవాలా అన్నారు. 

కరోనా వైరస్‌ను ఈ టీకా సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు వెల్లడైతే.. అత్యవసర అనుమతి కింద బిలియన్‌ (వంద కోట్ల) డోసులను డిసెంబర్‌ నాటికి ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ మొత్తం డోసులన్నీ భారత్‌కు వెళ్లనున్నాయని పూనవాలా ఓ  ఇంటర్వ్యూలో చెప్పారు. కొవిడ్ వ్యాక్సిన్ వినియోగానికి 2021లో పూర్తిస్థాయి అనుమతులు లభిస్తే 50-50 శాతం నిష్పత్తితో దక్షిణ ఆసియా దేశాలకు, పేద దేశాలకు సరఫరా చెయ్యాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఇప్పటివరకు 40 మిలియన్‌ మోతాదుల ఆస్ట్రాజెన్‌కా వ్యాక్సిన్‌ను తయారు చేసినట్లు చెప్పారు.  ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు అందరికీ  వ్యాక్సి్న్ అందడానికి 2024 వరకు సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు.  కొవిడ్ టీకాలు భారత్ లో అందరికీ అందించాలంటే రూ. 80, 000 కోట్లు అవసరం అని  ఈ మేరకు పూనావాల గత సెప్టెంబర్ నెలలోనే భారత ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకాల టీకా కోవిషీల్డ్‌ ప్రయోగాలు చివరిదశలో ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios