Asianet News TeluguAsianet News Telugu

తగ్గని కరోనా దూకుడు.. అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు పొడిగించిన భారత్

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై (international flight services) మరోసారి కేంద్రం ఆంక్షలు పొడిగించింది. ఈ మేరకు డీజీసీఏ (dgca) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. భారత్‌ నుంచి రాకపోకలు సాగించే విమాన సర్వీసులను ఫిబ్రవరి 28 అర్ధరాత్రి వరకు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాం అని డీజీసీఏ పేర్కొంది.

India extends ban on scheduled international flights till February 28
Author
New Delhi, First Published Jan 19, 2022, 3:53 PM IST

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై (international flight services) మరోసారి కేంద్రం ఆంక్షలు పొడిగించింది. ఈ మేరకు డీజీసీఏ (dgca) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. భారత్‌ నుంచి రాకపోకలు సాగించే విమాన సర్వీసులను ఫిబ్రవరి 28 అర్ధరాత్రి వరకు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాం అని డీజీసీఏ పేర్కొంది. ఒమిక్రాన్ (omicron) వెలుగులోకి రాకముందు అంతర్జాతీయంగా కొవిడ్ అదుపులో ఉన్నట్లు కనిపించడంతో గతేడాది డిసెంబర్ 15 నుంచి విమాన సర్వీసుల్ని పునరుద్ధరించాలని భారత ప్రభుత్వం భావించింది. 

కానీ ఒమిక్రాన్ వల్ల ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గాల్సి వచ్చిందని డీజీసీఏ పేర్కొంది. కరోనా వైరస్‌ వెలుగులోకి వచ్చిన 2020 మార్చి నుంచి అంతర్జాతీయ పాసింజర్‌ విమాన సర్వీసుల్ని భారత్‌ నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే వివిధ దేశాల్లో చిక్కుకుపోయినన భారతీయుల కోసం 2020 జులై నుంచి వందే భారత్‌ మిషన్‌ కింద ఎయిర్‌ బబుల్‌ ఏర్పాటు చేసి దాదాపు 40 దేశాలకు ప్రత్యేక విమానాలను నడుపుతోంది. 

మరోవైపు దేశంలో క‌రోనా పెరుగుతున్న త‌రుణంలో కోవిడ్‌-19 ప‌రీక్ష‌లు త‌గ్గుతుండ‌టంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఈ క్ర‌మంలోనే అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. "నిర్దిష్ట ప్రాంతాలలో క‌రోనా వైర‌స్ కేసుల‌ సానుకూల ధోరణిని దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మక పద్ధతిలో కోవిడ్-19 పరీక్షలను వెంటనే పెంచాలని" కోరింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) పోర్టల్‌లో అందుబాటులో ఉన్న డేటా ప్ర‌కారం.. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న‌... ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్ గా భావిస్తున్న ఒమిక్రాన్ కార‌ణంగా దేశంలో క‌రోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. అయితే, పెరుగుతున్న కేసుల మధ్య అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కోవిడ్-19 పరీక్షలలో క్షీణతను చూపుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి (ఆరోగ్యం) ఆర్తి అహుజా ఒక లేఖలో తెలిపారు.

కోవిడ్ పరీక్ష ప్రాథమిక లక్ష్యాన్ని త్వరితగతిన పెంచ‌డం,  ఐసోలేషన్, కోవిడ్ కేర్ కోసం ముందస్తుగా చ‌ర్య‌లు తీసుకోవ‌డం.. పాండమిక్ మేనేజ్‌మెంట్‌కు కీలకమైన వ్యూహంగా పేర్కొంటూ, "కొత్త క్లస్టర్‌ల గుర్తింపు మరియు ఇన్‌ఫెక్షన్‌ల కొత్త హాట్‌స్పాట్‌లు క‌రోనా నిర్వ‌హ‌ణ‌ను సులభతరం చేయగలవు. కంటైన్‌మెంట్ జోన్‌ల ఏర్పాటు, కాంటాక్ట్ ట్రేసింగ్, క్వారంటైనింగ్, ఐసోలేషన్ మరియు ఫాలోఅప్ వంటి నియంత్రణ కోసం ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాలి. ఇది ఇన్‌ఫెక్షన్ వ్యాప్తిని అరికట్టడానికి స‌హాయం చేయ‌గ‌ల‌దు.  రాష్ట్ర, జిల్లా పరిపాలన యంత్రాంగాలు ఈ విధంగా ముందుకు సాగ‌లి" అంటూ పేర్కొన్నారు. క‌రోనా వ్యాప్తిని, మ‌ర‌ణాల‌ను త‌గ్గించ‌డంలో కోవిడ్-19 ప‌రీక్ష‌లు కీల‌క పాత్ర పోషిస్తాయ‌ని అన్నారు. 

కాగా, రాబోయే కాలంలో కొత్త వేరియంట్ (Coronavirus) లో మరిన్ని వైవిధ్యాలను ఉండే అవ‌కాశాలు ఉన్నాయ‌నీ, మ‌రీ ముఖ్యంగా ఒమిక్రాన్ కార‌ణంగా మ‌రిన్ని వేరియంట్లు పుట్టుకు వ‌స్తాయ‌ని ప‌రిశోధ‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే  బోస్టన్ యూనివర్శిటీకి చెందిన ఎపిడిమాలజిస్ట్ లియోనార్డో మార్టినెజ్ మాట్లాడుతూ.. ఒమిక్రాన్ ఎంత వేగంగా వ్యాపిస్తుందో, అంత ఎక్కువగా రూపాంతరం చెందుతుందని అన్నారు. ఇలాంటి ఒమిక్రాన్ వేరియంట్ కార‌ణంగా మున్ముందు అనేక రకాల వేరియంట్స్ పుట్టుకు వచ్చే అవకాశం ఉంటుందని వెల్ల‌డించారు. తదుపరి వేరియంట్ రాకను నిర్ధారించడానికి లేదా అంచనా వేయడానికి మార్గం లేదని చెప్పారు. అయితే భవిష్యత్ లో రాబోయే క‌రోనా వైర‌స్ (Coronavirus) రూపాంత‌రాలు స్వ‌ల్ప అనారోగ్యానికి కారణమవుతాయని అంచ‌నా వేశారు. కానీ ఇదే ప‌క్క‌గా ఉంటుంద‌నే హామీ లేదని అన్నారు. ఇప్పుడున్న వాటికంటే ప్ర‌మాద‌క‌రంగానూ విజృంభించే వేరియంట్లు కూడా ఉండ‌వ‌చ్చున‌ని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios