హోలి వేడుకలో భాగంగా డీజే సౌండ్ ఎక్కువ పెట్టాడని పోలీసులు ఓ వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి తేనెటీగల దాడిలో మరణించాడని పోలీసులు చెప్పారు. కానీ, ఆయన బంధువులు, స్థానికులు మాత్రం పోలీసుల టార్చర్ చేసి చంపేశారని ఆందోళనలకు దిగారు. పోలీసు స్టేషన్‌కు, అక్కడే ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఓ పోలీసు మరణించారు.
పాట్నా: హోలి వేడుకలో డీజే సౌండ్‌పై అభ్యంతరం తెలిపి ఓ వ్యక్తిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి విగతజీవై కనిపించాడు. ఆయన తేనెటీగలు కుట్టి కస్టడీలో మరణించాడని పోలీసులు చెప్పారు. కానీ, మృతుడి కుటుంబీకులు, స్థానికులు మాత్రం పోలీసుల కథనాన్ని విశ్వసించలేదు. పోలీసులు తీవ్రంగా హింసించే ఆ వ్యక్తిని చంపేశారని ఆరోపించారు. ఆ ఆవేశంతోనే పోలీసులపైకీ దాడికి వెళ్లారు. అక్కడే ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ హింసాత్మక ఆందోళనలో ఓ పోలీసు దర్మరణం చెందాడు. కాగా, ఓ పోలీసు వాహనం, మరో ప్రైవేటు వెహికిల్ కాలి బూడిదైంది. పోలీసు స్టేషన్‌కూ నిప్పు పెట్టారు.
బిహార్‌లో హింసాత్మక ఆందోళనలు భగ్గుమన్నాయి. పశ్చిమ చంపారన్ జిల్లా బెట్టియాలో స్థానికులు పోలీసు స్టేషన్ ముందు ఆందోళనలకు దిగారు. తేనెటీగలు కుట్టి తమ కస్టడీలోని వ్యక్తి మరణించాడని చెప్పగానే బంధువులు, స్థానికులు ఆందోళనలకు దిగారు.
పోలీసులు అనిరుధ్ యాదవ్‌ను శనివారం కస్టడీలోకి తీసుకున్నారు. డీజేలో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ ప్లే చేస్తున్నాడని అనిరుధ్ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అనిరుధ్ యాదవ్ కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌కు వెళ్లగా.. అనిరుధ్ యాదవ్ విగత జీవుడై కనిపించాడు. దీంతో ఆ కుటుంబం తట్టుకోలేకపోయింది. ఆ గ్రామ ప్రజలూ అనిరుధ్ యాదవ్ మరణించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇది కచ్చితంగా పోలీసుల దుశ్చర్యేనని బలంగా అనుకున్నారు. పోలీసులే అనిరుధ్ యాదవ్‌పై విచక్షణారహితంగా దాడి చేశారని, గన్ చివరి బట్‌లతో దాడి చేసి గుళ్లబొడిచి చంపేశారని వాదించారు. పోలీసు టార్చర్ వల్లే అనిరుధ్ మరణించాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు.
బెట్టియా ఎస్పీ ఉపేంద్ర నాథ్ వర్మ ఈ ఘటనపై మాట్లాడారు. అనిరుధ్ యాదవ్ తమ కస్టడీలోకి తీసుకున్న తర్వాత అతనిపై తేనెటీగలు దాడి చేశాయని వివరించారు. ఆయనను వెంటనే హాస్పిటల్‌కు తరలించామని, కానీ, దారి మధ్యలోనే మరణించాడని చెప్పారు.
కానీ, స్థానికులు మాత్రం అనిరుధ్‌ను పోలీసులు టార్చర్ చేసే చంపేశారని సీరియస్ అయ్యారు. ఒక మూక ఏకంగా పోలీసు స్టేషన్ ముందు గాల్లోకి ఫైర్ చేశారు. ఆ తర్వాత చాలా మంది పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. అక్కడే ఉన్న మూడు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పోలీసు రామ్ జతన్ సింగ్ మరణించాడని ఎస్పీ వర్మ తెలిపారు. ఇక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయని, కానీ, ప్రస్తుతం అదుపులోనే ఉన్నాయని వివరించారు.
