హే ప్రభూ... యే క్యా హువా..! ఇంటి గోడపై పెద్దపులి గాఢ నిద్ర.. ఖంగుతిన్న జనాలు..

ఉత్తప్రదేశ్ లోని పిలిభిత్ జిల్లాలో ఓ పెద్ద పులి గ్రామంలోకి వచ్చింది. ఓ గోడపై రాత్రంతా కూర్చొని హాయిగా నిద్రపోయింది. ఉదయాన్నే దానిని చూసిన జనాలు హడలెత్తిపోయారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

In a village in Uttar Pradesh, a big tiger is fast asleep on the wall of a house..ISR

సాధారణంగా పులులు అడవుల్లో జీవిస్తుంటాయి. మనుషులందరూ గ్రామాల్లో, పట్టణాల్లో నివసిస్తుంటారు. పొలాల్లోకి వెళ్లినప్పుడో, అడవి సమీపంలోకి వెళ్లినప్పుడో అనుకోకుండా క్రూర జంతువులు కనిపిస్తే హడలెత్తిపోతాం. ఒక్క సారిగా బయపడి దాని నుంచి తప్పించుకునేందుకు అక్కడి నుంచి పారిపోతాం. మరి మనుసులు నివసించే ప్రాంతాల్లోకి అలాంటి క్రూర జంతువు వస్తే ఎలా ఉంటుంది ? రావడమే కాదు.. జనావాసాల మధ్య హాయిగా గాఢ నిద్రలోకి వెళ్తే అక్కడున్న జనాల పరిస్థితి ఏంటి ?.. ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ ఓ గ్రామ వాసులు. 

అసలేం జరిగిందంటే ?.. 
పిలిభిత్ జిల్లాలోని అట్కోనా గ్రామంలోని ప్రజలంతా ఎప్పటిలాగే సోమవారం రాత్రి నిద్రపోయారు. గ్రామమంతా నిశ్శబ్ధంలోకి వెళ్లిపోయిన తరువాత పిలిభిత్ జిల్లాలో ఉన్న టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఓ పెద్దపులి అక్కడికి చేరుకుంది. ఆ గ్రామంలో ఉన్న గురుద్వారా గోడపై ఎక్కింది. హాయిగా ఆ గోడపై విశ్రాంతి తీసుకుంది. తరువాత దానిపైనే గాఢ నిద్రలోకి జారుకుంది.

ఎప్పటిలాగే మంగళవారం ఆ గ్రామం నిద్రలేచింది. ఎవరి పనుల్లో వారు నిమగ్నమవడానికి సిద్ధమవుతున్నారు. ఇంతలో అటుగా వెళ్తున్న కొందరు గ్రామస్తులు గోడపై నిద్రిస్తున్న పులిని చూసి హడలెత్తిపోయారు. వెంటనే ఆ విషయాన్ని అందరికీ తెలియజేశారు. దీంతో వారంతా పరిగెత్తుకుంటూ వచ్చి పులిని చూసి ఖంగుతిన్నారు. ఆ అసాధారణ దృశ్యాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున జనం గుమిగూడారు.

జనాల అలజడి విని ఆ పులికి మెలుకువ వచ్చింది. అయితే ఈ లోపే అక్కడికి ఫారెస్ట్ అధికారులు చేరుకున్నారు. దానిని సురక్షితంగా పట్టుకోవడానికి వల ద్వారా భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇతర పోలీసులు అధికారులు కూడా ఘటనా స్థలానికి వచ్చారు. నిపుణుల పర్యవేక్షణలో దానిని బంధించి, అడవిలో వదిలిపెట్టారు.  అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios