ఎల్‌నినో ఎఫెక్ట్: దేశంలోని పలు రాష్ట్రాల్లో జూన్ వరకు అధిక ఉష్ణోగ్రతలు

ఎల్ నినో ప్రభావంతో జూన్ వరకు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు  ప్రకటించారు.

IMD warns of heatwave spells lasting 10-20 days in April-June  lns

న్యూఢిల్లీ:ఈ ఏడాది జూన్ వరకు  దేశంలోని పలు ప్రాంతాల్లో  వేడిగాలులు వీస్తాయని  భారత వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలంలో  ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని  వాతావరణ శాఖ తెలిపింది.

మధ్యప్రదేశ్, ఉత్తర కోస్తా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, లక్ష్యద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో  పగటిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే  1 నుండి  3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని  అధికారులు ప్రకటించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ వేసవిలో  గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కానున్నాయని ఐఎండీ వివరించింది.

జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తూర్పు భారతదేశం ప్రాంతాల్లో సాధారణం కటే  తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. రానున్న మూడు నెలల్లో 10 నుండి  20 రోజుల పాటు   వడగాలులు ఎక్కువగా వీచే అవకాశం ఉందని  వాతావరణ శాఖ తెలిపింది. 

రాజస్థాన్, గుజరాత్, సౌరాష్ట్ర-కచ్, మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి.  ఏప్రిల్ నుండి జూన్ వరకు  ఎక్కువగా వేడి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

భూమధ్యరేఖ పసిఫిక్ మహాసముద్రం వెంట సముద్ర ఉపరితం అసాధారణంగా వేడిక్కింది. ఎల్ నినో పరిస్థితులు చోటు చేసుకున్నాయి.ఎల్‌నినో కారణంగా  వర్షపాతం తక్కువగా నమోదౌతుంది.  అంతేకాదు ఉష్ణోగ్రతలు కూడ  పెరుగుతున్నాయి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios