ఆకతాయిల వేధింపులపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. మహిళపై పోలీసుల సామూహిక అత్యాచారం..
ఆకతాయిలు వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళపై వారే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ జిల్లాలో జరిగింది. దీనిపై పోలీసు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఓ మహిళను ఆకతాయిలు వేధిస్తున్నా. ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారు. అశ్లీలమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో విసుగెత్తుపోయిన మహిళ.. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేద్దామని వెళ్లారు. కానీ ఆ పోలీసులే ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ జిల్లాలో జరిగింది.
‘హిందుస్థాన్ టైమ్స్’ కథనం ప్రకారం.. ప్రయాగ్ రాజ్ జిల్లాలోని ట్రాన్స్ గంగా ప్రాంతంలోని జంఘై పోలీస్ ఔట్ పోస్టులో విధులు నిర్వర్తిస్తున్న సబ్ ఇన్ స్పెక్టర్ పై, అలాగే మరో ముగ్గురి తనపై సామూహిక అత్యాచారం చేశారని ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు సోమవారం రాత్రి సరాయ్ మమ్రేజ్ పోలీస్ స్టేషన్ లో నిందితులపై సామూహిక అత్యాచారం, బెదిరింపులు, ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
బాధితురాలికి కొంత కాలం నుంచి కొందరు వ్యక్తులు ఫోన చేసి అశ్లీలంగా మాట్లాడుతున్నారని, దీనిపై ఫిర్యాదు చేసేందుకు తాను జంఘై పోలీస్ ఔట్ పోస్టు ఇన్ చార్జి ఎస్ ఐ సుధీర్ పాండేను సంప్రదించానని ఆమె అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆ ఆకతాయిలను అరెస్టు చేస్తామనె నెపంతో సెప్టెంబర్ 21న సబ్ ఇన్స్పెక్టర్ మరో ముగ్గురితో కలిసి ఆమెను కారులో భదోహికి తీసుకెళ్లాడు. ఆ ప్రాంతంలో ఆ మహిళకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి సబ్ ఇన్ స్పెక్టర్, మిగిలిన ముగ్గురు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.
అయితే అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఆ కారు చెట్టును ఢీకొట్టింది. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా కారులో పోలీసులు, మహిళ అపస్మారక స్థితిలో ఉన్నారు. అయితే ఈ ఘటనపై బయటకు చెప్పొద్దని సబ్ ఇన్స్పెక్టర్, ఇతర నిందితులు బాధితురాలని హెచ్చరించారు. అయితే తరువాత బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తాత్కాలిక డీసీపీ (ట్రాన్స్ గంగా) రవిశంకర్ నిమ్ తెలిపారు. నిందితుడిపై త్వరలోనే తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.