రాజ్యసభలో కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ విషయంలో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల్లోనే రాజ్యసభ సభ్యునిగా పదవీ విరమణ చేయనున్న ఆజాద్‌కు ఆయన బంపర్ ఆఫర్ ఇచ్చారు.
రాజ్యసభలో కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ విషయంలో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల్లోనే రాజ్యసభ సభ్యునిగా పదవీ విరమణ చేయనున్న ఆజాద్‌కు ఆయన బంపర్ ఆఫర్ ఇచ్చారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
‘‘మీరు కచ్చితంగా మళ్లీ సభలోకి ప్రవేశించాలి. కాంగ్రెస్ మిమ్మల్ని నామినేట్ చేయకపోతే, మిమ్మల్ని రాజ్యసభకు నామినేట్ చేయడానికి మేం సిద్ధమే. రాజ్యసభకు మీ అవసరం ఉంది.’’ అని అథవాలే ఆజాద్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
రాజ్యసభలో కాంగ్రెస్ పక్షనేతగా గులాంనబీ ఆజాద్ వ్యవహరిస్తున్నారు .ఫిబ్రవరి 15 తో ఆయన రాజ్యసభ పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలోనే అథవాలే పై ప్రకటన చేశారు.