మళ్లీ మోడీ గెలిస్తే మటన్, చికెన్ పై నిషేధమే - డీఎంకే నేత వింత విమర్శలు (వీడియో)
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు డీఎంకేకు చెందిన ఓ నేత ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేశారు. మళ్లీ మూడో సారి ప్రధానిగా నరేంద్ర మోడీ ఎన్నికైతే చికెన్, మటన్ బీఫ్ పై నిషేధం విధిస్తారని అన్నారు.
లోక్ సభ ఎన్నికల సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అన్ని పార్టీలు తమ ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేస్తున్నాయి. ఏ ఎన్నికల సీజన్ అయినా ఓ నాయకుడిపై మరో నాయకుడు బురదజల్లడం సర్వసాధారణం. అయితే కొందరు నేతలు మాత్రం దాన్ని మరో లెవెల్ కు తీసుకెళ్లున్నారు.
అందులో భాగంగానే ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీకి చెందిన ఓ నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేశారు. చెన్నైలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డీఎంకే నేత ఒకరు ‘మోడీ మళ్లీ గెలిస్తే పెరుగు అన్నం, సాంబార్ రైస్ మాత్రమే తినగలరు, మటన్, బీఫ్, చికెన్ తినకుండా నిషేధం విధిస్తారు’’ అని అన్నారు. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా.. తమిళనాడులో 2024 లోక్ సభ ఎన్నికలు మొదటి దశలో జరగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 39 స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. సమర్థవంతమైన ఎన్నికల ప్రక్రియకు ప్రసిద్ధి చెందిన తమిళనాడులో 2019 ఎన్నికల్లో అన్ని స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరిగింది. అందుకే ఈ సారి కూడా ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
భారతదేశపు దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో మొత్తం 39 లోక్ సభ స్థానాలతో ఐదో స్థానంలో ఉంది. వీటిలో 32 స్థానాలు అన్ రిజర్వ్ డ్ కాగా, ఏడు స్థానాలు ఎస్సీ అభ్యర్థులకు రిజర్వ్ అయ్యాయి. 2019 ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ 39 స్థానాలకు గాను 38 స్థానాలు గెలుచి, దేశంలోనే అతి పెద్ద పార్టీకి ఒక్క సీటు మాత్రమే మిగిల్చింది