భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ మళ్లీ ఆకాశయానాన్ని ప్రారంభించారు. బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ఫిబ్రవరి 27న పాకిస్తాన్.. మనదేశంపై వైమానిక దాడులకు ప్రయత్నించింది.

అయితే భారత వాయుసేన అప్రమత్తంగా వ్యవహరించి.. పాక్ దాడిని తిప్పికొట్టింది. ఈ క్రమంలో పాకిస్తాన్ యుద్ధ విమానాలు మన ఫైటర్ జెట్లు తరుముకుంటూ వెళ్లాయి. ఆ సమయంలో మిగ్-21 విమానం నడుపుతూ పాక్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చేశారు అభినందన్.

అయితే పాక్ సైన్యం వర్థమాన్ విమానాన్ని కూల్చేయడంతో ఆయన పొరపాటున పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో దిగి శత్రుసైన్యానికి చిక్కారు. చిత్రహింసలకు గురి చేసినప్పటికీ.. ఎంతో ధైర్యంగా వ్యవహరించిన అభినందన్ అందరి మన్ననలు అందుకున్నారు.

అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా ఆయనను పాకిస్తాన్ మార్చి 1న భారత్‌కు అప్పగించింది. అప్పటి నుంచి దాదాపు రెండు వారాలపాటు వర్థమాన్.... బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసన్ వర్ధమాన్‌కు చికిత్సనందించింది.

ఇటీవల ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి.... అభినందన్‌ మళ్లీ విమానం నడిపేందుకు సిద్ధమేనని ప్రకటించింది. దీంతో ఆయన తిరిగి విధుల్లో చేరారు.. ప్రస్తుతం రాజస్ధాన్‌లోని భారత వైమానిక స్ధావరంలో అభినందన్ విధులు  నిర్వర్తిస్తున్నారు.