Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో చోరీ ముఠా గుట్టు రట్టు.. 8 మంది అరెస్ట్.. లక్షల విలువైన వస్తువులు స్వాధీనం 

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోరీ రాకెట్‌ను భద్రతా సిబ్బంది ఛేదించారు. పోలీసులు , విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి లక్షల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు

How A Theft Racket Run By Luggage Loaders At Delhi Airport Was Busted
Author
First Published Jan 15, 2023, 7:08 AM IST

ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (ఐజీఐ) విమానాశ్రయంలో చోరీ ఘటనలు నానాటికీ పెరిగిపోతున్నాయి. స్మగ్లర్లే కాదు.. ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా అక్రమాలకు పాల్పడుతున్నారు. పోలీసులు , విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీల్లో పని చేస్తున్న 8 మంది లోడర్‌లను అరెస్టు చేశారు. అదే సమయంలో వారి నుంచి  పెద్ద మొత్తంలో బంగారు-వెండి ఆభరణాలు, వాచీలు, మొబైల్ ఫోన్లు, నగదు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకెళ్తే.. పోలీసులు , విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ సంయుక్తంగా శనివారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో బంగారు, వెండి ఆభరణాలు సుమారు రూ. 10 లక్షల నగదు, 6 బ్రాండెడ్ వాచీలు, యాపిల్ ఫోన్, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వస్తువుల చోరీకి సంబంధించిన నాలుగు కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత పోలీసులు తదుపరి విచారణ ప్రారంభించారు. భద్రతా ఏజన్సీల సమన్వయంతో వివిధ విమానయాన సంస్థలు, గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీల్లో పని చేస్తున్న  లోడర్ల కదలికలను ఐజిఐ విమానాశ్రయం నిశితంగా గమనిస్తోందని ఢిల్లీ పోలీసు డిసిపి రవి కుమార్ సింగ్ జీ చెప్పారు. సిబ్బంది కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. 

11.01.2023న IGI ఎయిర్‌పోర్ట్ బృందం విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎయిర్‌లైన్స్ సహాయంతో దీపక్ పాల్ అనే లోడర్‌ను పట్టుకున్నారు. అతను అవకాశం దొరికినప్పుడల్లా ప్రయాణీకుల లగేజీలోంచి చిన్నచిన్న వస్తువులను దొంగిలించినట్టు గుర్తించారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 379/511 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

 ఈక్రమంలో నిందితుడు దీపక్ పాల్‌ను విచారించగా, అతను 2018 నుండి గ్రౌండ్ హ్యాండ్లింగ్ సహాయం అందించే కంపెనీలో లోడర్‌గా పనిచేస్తున్నట్లు వెల్లడించాడు. 18000/- జీతం అతనికి సరిపోకపోవడంతో అవకాశం దొరికినప్పుడల్లా ప్రయాణీకుల లగేజీలోంచి చిన్నచిన్న వస్తువులను దొంగిలిస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంగా అతను ఇతర విమానయాన సంస్థలు, ఏజెన్సీల్లో పనిచేస్తున్న ఏడుగురు లోడర్లు, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బంది ఓ గ్రూప్ గా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. వీరంతా దాదాపు ఒకే షిఫ్టు టైమ్‌లో పనిచేస్తుండడంతో చురుకైన సానుభూతితో ఒక ముఠాగా ఏర్పడి పెద్ద ఎత్తున వస్తువులను దొంగిలించడం ప్రారంభించారు.

సాంకేతిక నిఘా సహాయంతో.. బృందం అనుమానాస్పద లోడర్లందరినీ గుర్తించింది. నిందితులు గౌతమ్ కుమార్, మోషీన్ ఖాన్, రాహుల్ యాదవ్, యశ్వీందర్, పప్పి కుమార్,  నీరజ్ మొత్తం ఏడుగురు లోడర్ల ఆచూకీపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. అదే సమయంలో కమల్ కుమార్ అనే నిందితుడిని కూడా అరెస్టు చేశారు. అతని వద్ద నుండి భారీ మొత్తంలో దొంగిలించబడిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios