Karnataka Hijab Row: హిజాబ్, బుర్ఖా లేదా నిఖాబ్ లు ముస్లీం మహిళల అణచివేత చిహ్నాలని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ చేసిన వ్యాఖ్య‌ల‌ను అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు.  తస్లీమా నస్రీన్ నే ద్వేషానికి ప్రతీక అని ఒవైసీ విమర్శలు గుప్పించారు. 

Karnataka Hijab Row: కర్ణాటకలో హిజాబ్‌ వివాదం(Hijab Row) రోజురోజుకు ముదురుతోంది. క్ర‌మక్ర‌మంగా.. 
ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందుతుంది. గత నెలలో ఉడిపి జిల్లాలోని ప్రభుత్వ బాలికల పీయూ కళాశాలలో హిజాబ్ ధ‌రించార‌నే కార‌ణంతో కొందరు విద్యార్థినిలు కాలేజీలోకి రానివ్వ‌కుండా అడ్డుకున్నారు. దీంతో నిరసనలు ప్రారంభమయ్యాయి. అవి తర్వాత కర్ణాటకలోని మిగిలిన ప్రాంతాలకు కూడా వ్యాపించాయి. ప్ర‌స్తుతం ఈ వివాదంపై దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీంతో కర్ణాటక పేరు అంతర్జాతీయంగా మారుమోగుతోంది. 

ఇదిలా ఉంటే.. ఈ వివాదంపై రాజకీయ, సినీ ప్ర‌ముఖులు, సామాజిక వేత్త‌లు, ర‌చ‌యిత‌లు తమదైన శైలిలో స్పందిస్తూ వివాదంలో చిక్కుకుంటున్నారు. తాజాగా.. వివాదాస్పద బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్( Taslima Nasreen) ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో హిజాబ్ వివాదం (Hijab Row) గురించి మాట్లాడుతూ.. హిజాబ్, బుర్ఖా లేదా నిఖాబ్ లు ముస్లీం మహిళల అణచివేతకు చిహ్నాలు అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

ఈ వ్యాఖ్య‌ల‌పై AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. తస్లీమా నస్రీన్‌ను ద్వేషానికి చిహ్నంగా పేర్కొన్నారు అసదుద్దీన్ ఒవైసీ. శుక్ర‌వారం ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ..తస్లీమా నస్రీన్‌ వ్యాఖ్యలపై అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శలు గుప్పించారు. ద్వేషానికి ప్రతీకగా మారిన వ్యక్తికి ఇక్కడ కూర్చుని సమాధానం చెప్పను. ఉదారవాదులు తమ ఎంపిక స్వేచ్ఛలో మాత్రమే సంతోషంగా ఉంటారు. ప్రతి ముస్లిం తమలాగే ప్రవర్తించాలని ఉదారవాదులు కోరుకుంటారు. రాజ్యాంగం హామీ ఇస్తున్నా.. మతపరమైన గుర్తింపును వదిలివేయాలని మితవాద ఛాందసవాదులు కోరుకుంటున్నారు. 

భారత రాజ్యాంగం.. న‌చ్చిన మ‌తాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఇచ్చింది, మనస్సాక్షికి న‌చ్చిన విధంగా ఉండే స్వేచ్ఛను ఇచ్చింది. మతపరమైన గుర్తింపును కొనసాగించే స్వేచ్ఛను ఇచ్చిందని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. భారతదేశం లౌకిక దేశమని, తన మతాన్ని విడిచిపెట్టమని ఎవరూ చెప్పలేరని అన్నారు. భారతదేశం బహుళ సంస్కృతులు, బహుళ మతాల దేశం...కానీ,ఎలా ప్రవర్తించాలో ఎవరూ చెప్పలేరు, నా మతాన్ని విడిచిపెట్టమని, నా సంస్కృతిని వదిలిపెట్టమని ఎవరూ చెప్పలేరని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.


 తస్లీమా నస్రీన్ ఏం అన్నారంటే..

హిజాబ్, బుర్ఖా లేదా నిఖాబ్ అణచివేతకు చిహ్నాలు అని పేర్కొన్నారు. మత హక్కు , విద్యా హక్కుకు అతీతం కాదని కూడా ఆమె తెలిపారు. బుర్ఖాను చీకటి యుగపు పవిత్ర బెల్ట్‌తో ఆమె పోల్చారు. కొంతమంది ముస్లింలు హిజాబ్ అవసరం అని అనుకుంటారు మరియు కొందరు హిజాబ్ అవసరం లేదని భావిస్తారు. అయితే, కొంతమంది స్త్రీద్వేషకులు 7వ శతాబ్దంలో హిజాబ్‌ను ప్రవేశపెట్టారు, ఎందుకంటే అప్పట్లో స్త్రీలను లైంగిక వస్తువులుగా పరిగణించేవారు. వారు పురుషులు చూస్తే స్త్రీల వద్ద, పురుషులకు లైంగిక కోరిక ఉంటుంది.

కాబట్టి స్త్రీలు హిజాబ్ లేదా బురఖా ధరించాలి. వారు పురుషుల నుండి తమను తాము దాచుకోవాలి. "కానీ మన ఆధునిక సమాజంలో, 21వ శతాబ్దంలో.. ఉన్నాం.. ఇప్పుడూ స్త్రీ, పురుషులు సమానమ‌ని తెలుసుకున్నాం. కాబట్టి .. ఈ ఆధునిక స‌మాజంలో హిజాబ్ లేదా నిఖాబ్ లేదా బురఖా లు అణచివేతకు చిహ్నాలని తస్లీమా నస్రీన్ అన్నారు. మతం కంటే విద్య ముఖ్యమని స్ప‌ష్టం చేశారు. లౌకిక సమాజంలో సెక్యులర్ డ్రెస్ కోడ్ ఉండాలని అభిప్రాయ ప‌డ్డారు. విద్యా హక్కు మతానికి సంబంధం లేదని అన్నారు.