ఉగ్రవాది సంచారం, పోలీసుల దాడులు కర్ణాటకలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. రాజధాని బెంగళూరుకు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొడ్డబల్లాపుర పట్టణంలో ఒక అనుమానితుడిని ఎన్ఐఏ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు.

పట్టుబడిన వ్యక్తిని బంగ్లాదేశ్ పౌరుడిగా గుర్తించారు. ఎన్ఐఏ దాడుల నేపథ్యంలో కర్ణాటక హోంమంత్రి ఎంబీ పాటిల్ మీడియాతో మాట్లాడారు.

భద్రతా పరిణామాల దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించినట్లు మంత్రి తెలిపారు. ఈ విషయం జాతీయ దర్యాప్తు సంస్థ పరిధిలో ఉండటంతో తాను ఇంతకు మించి ఏం మాట్లాడలేనని.. ఎన్ఐఏకు అన్ని విధాలా సహకరిస్తామని పాటిల్ స్పష్టం చేశారు.