ఉత్తరాఖండ్‌ వరద సహాయక చర్యల్లో అపశృతి చోటు చేసుకుంది. సహాయక సామాగ్రితో వెళుతున్న హెలికాఫ్టర్ ఉత్తరకాశీ వద్ద కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మరణించారు. హెలికాఫ్టర్ మోరీ నుంచి మోల్డీ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

మరోవైపు భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు ఉత్తర భారతంలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు.. వీరిలో హిమాచల్‌ప్రదేశ్ నుంచి 25 మంది, ఉత్తరాఖండ్‌ నుంచి 16 మంది ఉన్నారు. కాగా.. యమునా నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తూ వుండటంతో దేశ రాజధాని ఢిల్లీకి ముప్పు పొంచి వుంది.