Asianet News TeluguAsianet News Telugu

ఆవు ఫుట్ బాల్ ఆట వెనుక..హార్ట్ బ్రేకింగ్ స్టోరీ ఉంది

నాలుగు రోజుల క్రితం ఓ ఆవు యువకులతో కలిసి ఫుట్ బాల్ ఆడుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే... ఆ ఆవు ఫుట్ బాల్ ఆట వెనుక హార్ట్ బ్రేక్ అయ్యే స్టోరీ ఉంది. 

heart breaking story behind the viral cow's foot ball skills
Author
Hyderabad, First Published Jul 6, 2019, 1:59 PM IST

నాలుగు రోజుల క్రితం ఓ ఆవు యువకులతో కలిసి ఫుట్ బాల్ ఆడుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే... ఆ ఆవు ఫుట్ బాల్ ఆట వెనుక హార్ట్ బ్రేక్ అయ్యే స్టోరీ ఉంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. గోవాలోని మార్డోల్ ప్రాంతంలో కొందరు యువకులు ఫుట్ బాల్ ఆడుతున్నారు. అంతలో బాల్ వెళ్లి అక్కడే ఉన్న ఓ ఆవు కాలు మధ్యలో ఇరుక్కుపోయింది. దానిని తీసుకుందామని ఓ యువకుడు ప్రయత్నించగా.. అది కొమ్ములతో పొడవబోయింది. అక్కడితో ఆగిందా.... ఆ బంతిని అచ్చం మనిషి ఆడినట్టే ఆడింది. 

ఓ యువకుడు డేర్ చేసి దాని దగ్గర నుంచి బంతిని తీసుకున్నాడు. అయినా ఆ ఆవు బంతిని వదలలేదు. బంతి ఎటువెళ్లే అటూ ఆ ఆవు అచ్చం ఫుట్ బాల్ ప్లేయర్ లాగా పరుగులు తీసింది. దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారింది.

వీడియో వైరల్ కావడంతో కొందరు ఔత్సాహికులు ఆవు అలా ఎలా ఆడిందో తెలుసుకోవాడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ నిజం తెలిసింది. కొద్ది రోజుల కిందటే ఆ ఆవు తన దూడను కోల్పోయిందట. అదే ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదం లో ఆ ఆవు తన దూడను కోల్పోయింది.

 అప్పుడే పుట్టిన దూడను కోల్పోవడంతో ఆవు తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో ఆ ప్రాంతంలోనే రోజూ తిరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే యువకులు బాల్ ఆడుతుండగా అది ఆవు దగ్గరపడింది. దానిని దాని బిడ్డగా భావించిన ఆవు బాల్ ని కాపాడే ప్రయత్నం చేసిందని స్థానికులు చెబుతున్నారు. మనషైనా, జంతువైనా అమ్మ ప్రేమ.. గొప్పదని ఈ ఆవు నిరూపిస్తోందని స్థానికులు చెబుతున్నారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios