అక్కడే ఆమె పెళ్లి కూడా చేసుకుంది. సదరు పెళ్లి కూతురు పేరు ప్రియ. కాగా.. తన తల్లిదండ్రులు, బంధువులతో కలిసి బారాత్ చేసుకుంటూ.. వరుడి ఇంటికి చేరుకోవడం గమనార్హం.

మామూలుగా అయితే పెళ్లిలో పెళ్లి కొడుకు గుర్రంపై స్వారీ చేస్తూ రావడం చాలా కామన్. చాలా రాష్ట్రాల్లో సాంప్రదాయ బద్దంగా వరుడు గుర్రపు స్వారీ చేసుకుంటూ ఊరేగింపుగా పెళ్లి మండపానికి చేరుకుంటారు. అయితే.. వెరైటీగా ఓ పెళ్లి కూతురు ట్రెండ్ మార్చేసింది. పెళ్లి కొడుకు మాత్రమే ఎందుకు గుర్రపు స్వారీ చేయాలి..? తాను ఎందుకు చేయకూడదు అనుకుంది. అంతే.. పెళ్లి మండానికి వరుడు బదులు.. ఆమె గుర్రం మీద స్వారీ చేసుకుంటూ రావడం గమనార్హం. ఈ సంఘటన హర్యానా రాష్ట్రం అంబాలా జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అంబాలా జిల్లాలో ఓ వధువు.. తన ఇంటి నుంచి చేతిలో కత్తి పట్టుకొని.. గుర్రపు స్వారీ చేసుకుంటూ.. వరుడి ఇంటికి చేరుకుంది. అక్కడే ఆమె పెళ్లి కూడా చేసుకుంది. సదరు పెళ్లి కూతురు పేరు ప్రియ. కాగా.. తన తల్లిదండ్రులు, బంధువులతో కలిసి బారాత్ చేసుకుంటూ.. వరుడి ఇంటికి చేరుకోవడం గమనార్హం.

మామూలుగా అయితే... వరుడు అలా ఊరేగింపుగా.. వధువు ఇంటికి వెళతాడు. ఇలా రివర్స్ లో ఆమె వెళ్లడం అక్కడి వారందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే.. ఇది తన చిన్ననాటి కల అని.. అది తీరినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పడం గమనార్హం. తనను ఇంట్లో అబ్బాయిలగా పెంచారని ఆమె చెప్పారు.

మగ పిల్లల కంటే ఆడపిల్లలు తక్కువ అనే అపోహ చాలా మందిలో ఉందని.. దానిని పోగొట్టాలని ఆమె తండ్రి నరీందర్ అగర్వాల్ పేర్కొన్నారు. కాగా.. తమ కుటుంబంలో చాలా మంది వ్యతిరేకించినా.. తాను న్యాయవాద వృత్తి చేపట్టడానికి.. తన తండ్రి సహకరించారని వధువు ప్రియ చెప్పింది.