Extra Marital Affairs:  గుజరాత్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత భరత్‌సింగ్‌ సోలంకీ అక్ర‌మ సంబంధాన్ని త‌న భార్య గుట్టు ర‌ట్టు చేసింది. ఓ హోటల్‌ గదిలో మరో మహిళతో సన్నిహితంగా  ఉన్న‌ భార్యకు రెడ్ హ్యండెడ్ గా ప‌ట్టుకుంది. వారిద్ద‌రికి చిత‌క‌బాదింది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.  

Extra Marital Affairs: అక్ర‌మ‌ సంబంధాలు.. వివాహ బంధం యొక్క గొప్ప‌త‌నానికి మ‌చ్చ తీసుకు వ‌స్తున్నాయి. పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. జీవితాంతం ప్ర‌తి విష‌యంలో ఒక్క‌రికొక‌రు తోడుగా ఉండాల్సిన భార్యభర్తలు బజారున ప‌డుతున్నాయి. దీంట్లో ఉన్నత స్థానంలో ఉండి, వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్న వారు కూడా ఉన్నారు. తమ పరువే కాకుండా.. తమ కుటుంబపు పరువును కూడా తీస్తున్నారు. ఇలాంటి ఘటన గుజరాత్ లో బ‌య‌ట‌ప‌డింది.

ఆయ‌న సాధార‌ణమైన వ్య‌క్తి కాదు.. ఆయ‌నో కేంద్ర మాజీ మంత్రి. అంతే కాదు.. ఆయ‌న కాంగ్రెస్ పార్టీకి  రాష్ట్ర అధ్య‌క్షుడిగా  రెండు సార్లు ప‌ని చేశారు. అలాంటి నాయ‌కుడు.. ఆద‌ర్శంగా ఉండాల్సిన నేత‌..  క‌ట్టుకున్న‌ భార్య‌ను వ‌దిలేసి.. మ‌రో యువ‌తితో వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తున్నాడు. దీంతో ఆగ్ర‌హించిన ఆ ఇల్లాలు.. ఓ లాడ్జీలో ఆ యువ‌తితో రాస‌లీల‌ల్లో మునిగి తేలుతున్న ఆ నాయ‌కుడిని.. రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకుంది. స‌దరు మహిళను చితకబాదింది

వివ‌రాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని ఆనంద్  చెందిన భ‌ర‌త్ సింగ్ సోలంకి గ‌తంలో కేంద్ర మంత్రిగా ప‌ని చేశారు. అలాగే.. గుజ‌రాత్‌లో కాంగ్రెస్ పార్టీకి అధ్య‌క్షుడిగా కూడా ప‌నిచేశారు. అయితే త‌న భార్య రేష్మా ప‌టేల్‌తో భ‌ర‌త్ సింగ్‌కు చాలా రోజుల నుంచి విబేధాలు ఉన్నాయి. ఆమె నుంచి విడాకులు కూడా కోరాడు. ఇద్ద‌రికి ఇద్ద‌రు బ‌హిరంగంగానే విమ‌ర్శించుకుని, ప‌బ్లిక్ నోటీసులు జారీ చేసుకున్నారు. ఈ క్ర‌మంలో భ‌ర‌త్ సింగ్ సోలంకి మ‌రో యువ‌తితో వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తున్నాడు. గుజ‌రాత్ ఆనంద్‌లోని ఉన్న ఓ హోట‌ల్ లో ఆ మ‌హిళ‌తో భ‌ర‌త్ సింగ్  ఉన్న‌డ‌ని తెలుసుకోని .. ఆక‌స్మికంగా దాడి చేసి..వారిద్ద‌రిని రేష్మా ప‌టేల్ రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకుంది.
  
వీడియో వైర‌ల్

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఆయన భార్య రేష్మా పటేల్ తీసింది. భరత్ సింగ్ సోలంకీకి మరో మహిళతో సంబంధం ఉందని రేష్మా పటేల్ ఆరోపించారు. దీనికి సంబంధించి ఇద్దరి మధ్య న్యాయ పోరాటం కూడా జరుగుతోంది. రేష్మా పటేల్ తన భర్తను మహిళతో కలిసి ఓ హోట‌ల్ గదిలో ఉన్న‌ర‌ని తెలుసుకుని.. అక్క‌డికి కొంతమందితో క‌లిసి వెళ్ళింది. గ‌దిలోకి బ‌ల‌వంతంగా ప్రవేశించింది. ఆ గ‌దిలో మ‌రో యువ‌తి క‌నిపించ‌డంతో  సోలంకి భార్య రేష్మా పటేల్‌ ఆగ్రహంతో ఊగిపోయింది. ఆ యువతి జుట్టు పట్టుకొని.. దాడి చేసింది. ఆ రూంలో ఆ యువ‌తిని పరిగెత్తిస్తూ.. తీవ్రంగా కొట్టింది. ఆ గదిలోకి  భార్య సడెన్‌ ఎంట్రీ ఇవ్వడంతో సోలంకి షాక్ అయ్యాడు. 

భార్యను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమెకు ఎంతకు వినిపించుకోలేదు. వీడియో తీస్తునే..  'నువ్వు నా భర్తతో  కూర్చున్నావు.. నేను నిన్ను విడిచిపెట్టను.. అంటూ ఆ యువ‌తికి వార్నింగ్ ఇచ్చింది. అయితే సదరు యువతి ముఖం దాచుకునే ప్రయత్నం చేయ‌గా...   నీ ముఖం చూపించు' వంటి ఇతర వ్యాఖ్యలను ఆ వీడియో వినవచ్చు. రేష్మా పటేల్‌తో పాటు వ‌చ్చిన వ్యక్తులు ఆ  తతంగాన్ని వీడియో తీశారు. 

పాత వివాదం

ఈ ఘటనపై భరత్ సింగ్ సోలంకీ గానీ, గుజరాత్ కాంగ్రెస్ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. భరత్ సింగ్ సోలంకి, అతని భార్య రేష్మా పటేల్ మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోంది. రేష్మా పటేల్, భరత్ సింగ్ సోలంకీ గతంలో ఒకరికొకరు పబ్లిక్ నోటీసులు జారీ చేశారు. తనను వేధించి ఇంటి నుంచి గెంటేశారని రేష్మా పటేల్ ఆరోపించింది. భరత్ సింగ్ సోలంకీ కూడా ఆమె త‌న జీవితాన్ని నాశ‌నం చేసిందనీ, విడాకుల కోసం బలవంతంగా తన రాజకీయ పదవిని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. భరత్ సింగ్‌తో విడాకులు తీసుకోనని రేష్మ చెప్పింది. బోర్సాద్ కోర్టులో తన భర్తపై పిటిషన్ కూడా వేసింది. భరత్ సింగ్ సోలంకి... మాజీ ముఖ్యమంత్రి మాధవ్ సింగ్ సోలంకి కుమారుడు. రేష్మా, భరత్ సింగ్‌ల న్యాయపోరాటానికి సంబంధించి ఇరువురు వార్తాపత్రిక ద్వారా అనేకసార్లు ఒకరికొకరు నోటీసులు పంపుకున్నారు.

 

Scroll to load tweet…