రాజ్ కోట్: గుజరాత్ లో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. తమతో గ్రూప్ సెక్స్ లో పాల్గొనాలని ముగ్గురు యువకులు 20 ఏళ్ల యువతిని బ్లాక్ మెయిల్ చేశారు. దాంతో యువతి మంటలు అంటించుకుని ఆత్మాహుతికి పాల్పడింది. ఈ ఘటన మోర్బీ జిల్లాలోని వాంకనార్ లో గల పేడక్ సొసైటీలో జరిగింది. 

ఆ దారుణమైన సంఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో ఓ మహిళ కూడా ఉంది. మృతురాలిని సోనాల్ వోరాగా గుర్తించారు. గురువారంనాడు యువతి ఆత్మాహుతి చేసుకుంది. 

నిందితులను జితేంద్ర మక్వానా, రాహుల్ వొరా, అఖిల్ పర్మార్, గౌరి ఉభాడియాలుగా గుర్తించారు. సోనాల్ సూసైడ్ నోట్ రాసింది. మక్వానా తనను ముద్దు పెట్టుకుని దాన్ని వీడియో తీశాడని, దాన్ని చూపించి మక్వానాతో పాటు ఇతర నిందితులు తనను బ్లాక్ మెయిల్ చేసి గ్రూప్ సెక్స్ లో పాలు పంచుకోవాలని ఒత్తిడి చేశారని, ఉభాడదియా వారికి సహకరించిందని ఆ సూసైడ్ నోట్ లో రాసింది. 

పోలీసులు రాహుల్ ను, ఉభాడియాను అరెస్టు చేశారు ఇతరుల కోసం గాలిస్తున్నారు. సోనాల్ వాంకనేర్ బాలికల పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు పనిలోకి వెళ్లిన తర్వాత సోనాల్ ఆత్మహత్య చేసుకుంది.