Asianet News TeluguAsianet News Telugu

పెళ్ల‌యిన త‌రువాత ఆ ఆట ఆడేందుకు అనుమ‌తిస్తేనే పెళ్లి.. పెళ్లి కూతురుతో పెళ్లికొడుకు స్నేహితుల డీల్‌!

పెండ్లి తర్వాత  ఎలాంటి ష‌ర‌తుల్లేకుండా తమతో క్రికెట్‌ ఆడేందుకు అనుమతించాలని వరుడి స్నేహితులు వధువుతో ఒప్పందం చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని ఉసిలంపాటిలో చోటుచేసుకుంది.  ప్రస్తుతం ఈ వెరైటీ కాంట్రాక్ట్‌ సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

Groom to continue innings with playing contract
Author
First Published Sep 12, 2022, 11:38 AM IST

పెళ్లంటే నూరేళ్ల పంట..పెళ్లైన కొత్తలో దంప‌తులు ఎంతో అన్యోన్యంగా ఉన్నప్పటికీ.. రోజులు గడిచే కొద్దీ వారి మ‌ధ్య అనుబంధం, ప్రేమ క్ర‌మంగా త‌గ్గుతోందనే అభిప్రాయం అంద‌రిలో ఉంది. ఇందుకు ప‌లు కార‌ణాలున్నాయి. అది.. దంప‌తుల‌ మ‌ధ్య అభిప్రాయ భేదాలు రావ‌డం కావొచ్చు.. ఒక‌రి నిర్ణ‌యాలు ఒక‌రికి న‌చ్చ‌క‌పోవ‌డం కావొచ్చు. జీవిత భాగ‌స్వామి నుంచి ఆశించిన‌వి పొంద‌లేక‌పోవ‌డం.

కొన్ని సంద‌ర్భాల్లో ఇరువురి స్నేహితులు దంప‌తుల మ‌ధ్య గొడ‌వ‌కు కార‌ణ‌మ‌వుతారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఓ వరుడి స్నేహితులు వినూత్నంగా ఆలోచించారు. త‌మ వ‌ల్ల‌ ప్యూచ‌ర్ల‌లో దంప‌తుల మ‌ధ్య ఎలాంటి గొడ‌వలు రాకూడ‌ద‌ని.. ముందుగానే పెళ్లికొడుకు స్నేహితులు పెళ్లికూతురుతో ఓ ఒప్పందం చేసుకున్నారు.  పెళ్లయిన తర్వాత కూడా తమతో క్రికెట్‌ ఆడేందుకు అనుమతించాలని  ప‌లు అంశాలతో కూడిన ఓ ఒప్పంద పత్రాన్ని తయారుచేసి.. పెళ్లికూతురుతో సంతకం పెట్టించుకున్నారు. ఇది సరదాకో, సీరియస్‌గానో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వెరైటీ కాంట్రాక్ట్‌ సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. మదురై జిల్లా ఉసిలంబట్టి మున్సిపాలిటీ పరిధిలోని కీజాపుదూర్‌ ప్రాంతానికి చెందిన హరిప్రసాద్  ఓ ప్రైవేట్‌ ఇంజినీరింగ్ కాలేజ్ లో అధ్యాప‌కుడిగా పనిచేస్తున్నాడు. హ‌రిప్ర‌సాద్ అటు అధ్యాప‌కుడి గానే కాదు.. క్రికెట్‌లో కూడా రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆయ‌న‌కు ఇటీవ‌ల తేనీకి చెందిన పూజ అనే అమ్మాయితో ఉసిలంపాటిలో శుక్రవారం పెళ్లి చేయాల‌ని పెద్ద‌లు నిర్ణ‌యించారు. పెళ్లి రోజు రానే వ‌చ్చింది. పెళ్లి మండ‌పంలో అంత సంద‌డి, కోలాహం, హుషారుగా పెళ్లి ప‌నులు సాగుతున్నాయి. పెళ్లి ముహుర్తం కూడా స‌మీపిస్తోంది. ఇంత‌లో పెళ్లికొడుకు స్నేహితులు స‌డెన్ గా  ఎంట్రీ ఇచ్చారు. పెళ్లి మండ‌పంలోకి పెళ్లి కుతూరు రాగానే.. ఓ వెరైటీ అగ్రిమెంట్ తీసుక‌వ‌చ్చి.. త‌న‌ను సంత‌కం చేయాల‌ని పెళ్లి కుతూరుపై ఒత్తిడి చేశారు. పెళ్లి కొడుకు హరిప్రసాద్ కూడా సంత‌కం పెట్టాల‌ని పట్టుబట్టారు. పెళ్లి కూతురు తొలుత ఆ అగ్రిమెంట్ కు ఒప్పుకోక‌పోయినా.. అంద‌రూ రిక్వెస్ట్ చేయ‌డంతో కాద‌న‌లేక సంత‌కం చేసింది.

ఇంత‌కీ ఆ అగ్రిమెంట్ లో ఏముందంటే?

ఆ ఒప్పందంలో ‘పెళ్లి అయిపోయినా కూడా త‌మ స్నేహితుడిని మాతో ఎప్పటిలాగే క్రికెట్ ఆడేందుకు అనుమతించాలి’ అని పేర్కొన్నారు. ఒప్పందంపై సంతకం పెట్టాలని తొలుత‌ వధువును ఒత్తిడి చేశారు. తొలుత షాక్ తిన్న పెళ్లికూతురు పూజ.. 'వారంలో శని, ఆదివారాల్లో క్రికెట్ ఆడేందుకు మాత్ర‌మే.. క్రికెట్ ఆడేందుకు అనుమతి నిస్తూ.. ఆ ఒప్పందంపై సంత‌కం చేసింది. పెళ్లికూతురు అగ్రిమెంట్‌పై సంతకం చేసిన తర్వాత వారి పెళ్లి జరిపించారు. క్రియేటివ్ ఐడియాతో పెళ్లి కొడుకు స్నేహితుడి పెళ్లిలో ఓ ట్రెండ్ సెట్ చేశారు. ప్ర‌స్తుతం వెరైటీ కాంట్రాక్ట్‌ సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.
 
సోషల్ మీడియాలో ఈ వార్త చూసి పెళ్లయిన చాలా మంది.. 'అయ్యో స్నేహితులకు ఈ ఆలోచన తెలియదు..', 'పెళ్లి తర్వాత చాలా ఇష్టమైన ఆటలు ఆడలేను', 'పెళ్లి తర్వాత స్నేహితులు మిస్సవడం నిజమే' అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. 'అదంతా పబ్లిసిటీ' అని మ‌రికొంద‌రూ వ్యాఖ్యానిస్తున్నారు.

పెళ్లయ్యాక వరుడి క్రీడల్లో పాల్గొనకుండా భార్యలు అడ్డుకునే సందర్భాలు అనేకం చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ విధంగా వరుడి స్నేహితులు వధువు చేత అంగీకార ఒప్పందం చేసుకున్న‌ట్టు తెలిపారు. ఈ అగ్రిమెంట్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios