Toll Plazas: వాహనదారులకు గుడ్‌న్యూస్.. నో టోల్ గేట్స్.. 6 నెలల్లో జీపీఎస్ ఆధారిత వసూలు!
Toll Plazas: దేశంలోని హైవేలపై ఉన్న టోల్ ప్లాజాలను తొలగించి.. ప్రభుత్వం వచ్చే ఆరు నెలల్లో జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను, ఇతర సాంకేతికతలను ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం వెల్లడించారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) టోల్ ఆదాయం ప్రస్తుతం రూ.40,000 కోట్లుగా ఉందని, రెండు-మూడేళ్లలో రూ.1.40 లక్షల కోట్లు అవుతుందని ఇండస్ట్రీ బాడీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) నిర్వహించిన కార్యక్రమంలో గడ్కరీ తెలిపారు.
Toll Plazas: దేశంలో ఎక్స్‌ప్రెస్‌వేలు , హైవేలు నిరంతరంగా నిర్మించబడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఇతర మార్గాల్లో కాకుండా తమ వాహనాల్లో ప్రయాణించేందుకు మొగ్గుచూపుతున్నారు. అటువంటి పరిస్థితిలో.. టోల్ ప్లాజా వద్ద క్యూలో ఉండటం వల్ల చాలాసార్లు సమస్య ఉంది. అయితే .. సమస్యలకు త్వరలో పరిష్కరం లభించనున్నది. త్వరలో టోల్ ప్లాజాలో టోల్ చెల్లించే విధానంలో మార్పు రానున్నది. రానున్న ఆరు నెలల్లో దేశంలోని టోల్ ప్లాజాల వద్ద టోల్ టాక్స్ వసూలు చేసే విధానంలో మార్పు వస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలియజేశారు. ఈ మార్పు తర్వాత.. టోల్ ప్లాజా వద్ద రద్దీ తగ్గుతుంది. దూరం ప్రకారం టోల్ వసూలు చేయబడుతుంది.
దేశంలో ప్రస్తుతం ఉన్న హైవే టోల్ ప్లాజాల స్థానంలో వచ్చే 6 నెలల్లో జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్‌తో కూడిన కొత్త టెక్నాలజీలను ప్రభుత్వం ప్రవేశపెడుతుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఒక కార్యక్రమంలో తెలిపారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడం , హైవేపై ప్రయాణించే ఖచ్చితమైన దూరానికి డ్రైవర్ల నుండి టోల్ వసూలు చేయడం లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు.
ఇండస్ట్రీ బాడీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి గడ్కరీ మాట్లాడుతూ.. ప్రభుత్వ యాజమాన్యంలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) టోల్ ఆదాయం ప్రస్తుతం రూ.40,000 కోట్లుగా ఉందని, రెండు-మూడేళ్లలో రూ.1.40 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అన్నారు. దేశంలోని టోల్ ప్లాజాల స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్‌తో సహా కొత్త టెక్నాలజీలను ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆయన చెప్పారు. ఆరు నెలల్లో కొత్త టెక్నాలజీని తీసుకొస్తామని అన్నారు. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వాహనాలను ఆపకుండా ఆటోమేటిక్ టోల్ వసూలును ప్రారంభించడానికి ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్ (ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్ కెమెరా) పైలట్ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తోంది.
2018-19 సంవత్సరంలో టోల్ ప్లాజా వద్ద వాహనాల సగటు నిరీక్షణ సమయం ఎనిమిది నిమిషాలు. కానీ 2020-21 , 2021-22 సంవత్సరాలలో ఫాస్ట్‌ట్యాగ్‌ని ప్రవేశపెట్టడంతో, వాహనాల సగటు నిరీక్షణ సమయం 47 సెకన్లకు తగ్గింది. కొన్ని చోట్ల వేచి ఉండే సమయం గణనీయంగా మెరుగుపడినప్పటికీ, చాలా చోట్ల రద్దీ సమయాల్లో టోల్ ప్లాజాల వద్ద టోల్ వసూలు చేయడంలో ఇంకా కొంత జాప్యం జరుగుతోంది.