కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చిత్తశుద్ధిగా పని చేసి ఉంటే తన లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉండేది కాదని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. 

goa election news 2022 : ఆమ్ ఆద్మీ పార్టీ (aam admi party) జాతీయ కన్వీన‌ర్, ఢిల్లీ సీఎం అరవింద్ (delhi cm arvind kejriwal) కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు, కాంగ్రెస్ ప్రజల కోసం స‌రిగ్గా పనిచేస్తే, తాను రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని చెప్పారు. గురువారం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా (ranadeep singh surjewala) కేజ్రీవాల్ ను ‘‘ఛోటా మోడీ’’ (chota modi) గా అభివర్ణించారు. ఈ వ్యాఖ్య‌లు వెలుగులోకి వ‌చ్చిన ఒక రోజు త‌రువాత కేజ్రీవాల్ స్పందించారు. శుక్ర‌వారం మీడియాతో మాట్లాడిన ఆప్ నేత సూర్జేవాల‌ను ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఆయ‌న ఏది అనాలంటే అది అనొచ్చని, దాని వ‌ల్ల ఎలాంటి మార్పు ఉండ‌ద‌ని తెలిపారు. ‘‘ వాస్తవానికి ఆయ‌న (రణ్‌దీప్ సుర్జేవాలా) కలలో న‌న్ను ద‌య్యంగా భావిస్తున్నాడు. ఒక రోజులోని 24 గంట‌ల్లో నేను ఆయ‌న మ‌న‌స్సులోనే ఉంటున్నాను. వారు (కాంగ్రెస్ నాయకులు) నా గురించి చెడుగా మాట్లాడుతున్నారు.’’ అని కేజ్రీవాల్ చెప్పారు. 

తన గురించి చెడుగా మాట్లాడే బదులు ప్రజల కోసం పని చేస్తే బాగుండేందని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి అర‌వింద్ కేజ్రీవాల్ అన్నారు. అయినా వాళ్లు ప్ర‌జ‌ల కోసం ప‌ని చేసే వాళ్ల అయితే తన లాంటి వ్య‌క్తి రాజ‌కీయాల్లోకి ఎందుకు వ‌చ్చేవార‌ని చెప్పారు. గోవాలో ప్ర‌జ‌లు త‌మ పార్టీకి ఓటు వేస్తార‌ని కేజ్రీవాల్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. గోవాలో ఓడిపోతున్న బీజేపీ (bharathiya janatha party -bjp) కి తాను క‌వ‌రింగ్ ఫైర్ ఇవ్వ‌డానికే వ‌చ్చాన‌ని చెప్పారు. 

ఆప్ అభ్య‌ర్థులు లీగ‌ల్ అఫిడవిట్‌ (legal affidavit)లపై సంతకం చేసిన విధంగానే.. రాహుల్ గాంధీ (rahul gandhi) స‌మక్షంలో విధేయ‌త ప్రతిజ్ఞ చేయ‌డంపై మీడియా కేజ్రీవాల్ ను ప్రశ్నించిన‌ప్పుడు.. మంచి విష‌యాల‌ను కాపీ చేయ‌డాన్ని స్వాగితిస్తున్నాన‌ని చెప్పారు. ‘‘ ఆయ‌న (రాహుల్ గాంధీ) మా నుంచి విషయాలను కాపీ చేస్తే చేయ‌నివ్వండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్ (rajastan), ఛత్తీస్‌ఘఢ్ (chattisghad) వంటి రాష్ట్రాల్లో కూడా మా పథకాలను అమలు చేయాలని మేము కోరుతున్నాం ’’ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీని అన్ని మంచి పనులు చేయనివ్వండి.. అప్పుడు నేను కూడా రాజకీయ పార్టీని నడపాల్సిన అవసరం లేదని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. 

గోవా (goa)లో అసెంబ్లీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాయి. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారంలో వేగం పెంచింది. ఇప్ప‌టికే గోవా ఓట‌ర్ల కోసం మేనిఫెస్టో ప్ర‌క‌టించి, ఇంటింటి ప్ర‌చారం నిర్వ‌హించిన ఆప్ తాజాగా ఎస్టీల కోసం ప్ర‌త్యేకంగా 8 అంశాల‌తో కూడా ఎజెండాను విడుద‌ల చేసింది. ఈ మేర‌కు అర‌వింద్ కేజ్రీవాల్ నేడు మీడియా సమ‌క్షంలో దానిని చ‌దివి వినిపించారు. గోవాలో త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే ఎస్టీలకు ఉచిత విద్య, వైద్యం కల్పిస్తామ‌ని హామీ ఇచ్చారు. అలాగే అసెంబ్లీలో 12.5 శాతం ​​కోటా కల్పిస్తామని చెప్పారు. గోవాలోని షెడ్యూల్డ్ తెగల వర్గాలను గ‌త ప్ర‌భుత్వాలు అన్యాయంగా నిర్లక్ష్యం చేశాయ‌ని, రాజ్యాంగానికి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించాయ‌ని ఆరోపించారు.