భోపాల్: తల్లిదండ్రులను కోల్పోయిన బాలికపై బావ దారుణానికి పాల్పడ్డాడు. 9 ఏళ్ల వయస్సులో తల్లిదండ్రులను కోల్పోయిన బాలికకు బావ ఆశ్రయం ఇచ్చాడు. అయితే, ఆమెపై అతనే అత్యాచారానికి పాల్పిడన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

భోపాల్ కు చెందిన ఓ మైనర్ బాలిక తల్లిదండ్రులు 2014లో మరణించారు. దాంతో మైనర్ బాలికను, ఆమె అన్ననను అక్కాబావలు తమ ఇంటికి తీసుకుని వెళ్లారు. అయితే, బాలికపై అక్క భర్త కన్నేశాడు. 9 ఏళ్ల వయస్సు నుంచి ఏడేళ్లుగా బాలికపై అతను అత్యాచారం చేస్తూ వచ్చాడు.

బాలికను తన మిత్రుడిని ఇంటికి తీసుకుని వెళ్లి అక్కడ ఆమెపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బాలికను బెదిరించాడు. దాంతో ఇప్పటి వరకు ఆ విషయం వెలుగులోకి రాలేదు. 

కొన్నేళ్ల తర్వాత బాలిక అన్నకు ఉద్యోగం వచ్చింది. దాంతో బావ ఇంటి నుంచి బాలిక బయటకు వచ్చింది. బాలిక ఓ స్వచ్ఛంద సంస్తలో చేరి కొన్ని నెలలుగా అక్కడ పనిచేస్తూ వస్తోంది. తన బావ చేసిన అకృత్యాన్ని బాలిక తన స్నేహితురాలికి ఇటీవల చెప్పింది. మిత్రురాలి ద్వారా స్వచ్ఛంద సంస్థ కార్యకర్తకు ఆ విషయం తెలిసింది. 

కార్యకర్త సాయంతో సోమవారం బాలిక అక్క భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.