Asianet News TeluguAsianet News Telugu

ప్రియుడిని చెట్టుకు కట్టేసి.. అతని ముందే యువతిపై గ్యాంగ్‌రేప్..

మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి ఎదుటే ప్రియురాలిపై దుండగులు సామూహిక అత్యాచారం జరిపారు. ప్రియుడి కాళ్లూ చేతులూ చెట్టుకు కట్టేసి అతని ఎదుటే తన ప్రియురాలిపై దుండగులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగింది.  

Girl Allegedly Gang-Raped, Boyfriend Tied To Tree In Maharashtra
Author
First Published Mar 24, 2023, 2:07 AM IST

ఏకాంతంగా మాట్లాడుకునేందుకు కొండ ప్రాంతానికి వెళ్లిన ఆ ప్రేమజంటకు దారుణ అనుభవం ఎదురైంది. బాలికపై కన్నేసిన కామాంధులు..  ప్రియుడిపై ఖాళీ బీరు బాటిల్‌తో దాడి చేశారు. ఆ కామాంధులు ప్రియుడి బట్టలు విప్పి చెట్టుకు కట్టేసి.. ప్రియురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అరెస్టు చేసి స్థానిక మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచారు. , వారిని పోలీసు కస్టడీకి అప్పగించారు.

వివరాల్లోకెళ్తే.. ముంబైలోని సుదూర శివారు ప్రాంతమైన విరార్‌లోని సాయినాథ్ నగర్ ప్రాంతానికి చెందిన యువతి, యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. తరుచూ సినిమాలు, షికార్లకు వెళ్లేవారు.  బుధవారం రోజున ఆ జంట ఏకాంతంగా మాట్లాడుకునేందుకు వారి నివాసానికి సమీపంలోని కొండపైకి వెళ్లింది. ఈ క్రమంలో చెట్ల పొదల్లోకి వెళ్లి ముచ్చట్లు చెప్పకుంటూ చీకటి పడిన విషయాన్నే గమనించలేదు. అదే సమయంలో అటుగా నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు కామాంధులు వారిద్దరిని గమనించారు. ప్రేమజంటను నిర్మానుష్య ప్రాంతానికి బలవంతంగా తీసుకెళ్లారు.

ఈ క్రమంలో ప్రియుడిపై ఖాళీ బీరు సీసాలతో దాడి చేశారు. అనంతరం ప్రియుడి బట్టలు విప్పించి.. చెట్టుకు కట్టేసి అతడి కళ్లెదుటే.. తాను ప్రేమించిన యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ ఇద్దరు కామాంధులు అక్కడి నుంచి పరారయ్యారు. ఎలాగోలా నిందితుల బారి నుంచి తప్పించుకుని ఇంటికి వెళ్లిన యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితులందరినీ గుర్తించి అరెస్ట్ చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్టు చేసి స్థానిక మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచారు. , వారిని పోలీసు కస్టడీకి అప్పగించారు.

Follow Us:
Download App:
  • android
  • ios