కాంగ్రెస్ పార్టీ త‌మ‌ రక్తం, చెమటతో ఏర్పాటు చేశామ‌ని, కంప్యూటర్‌లతో.. ట్విట్టర్‌తో కాదు, మెసేజ్‌లతో తయారు చేసింది కాదనీ, పార్టీని అప్రతిష్టపాలు చేయకూడ‌ద‌ని అన్నారు.  

కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తర్వాత గులాం నబీ ఆజాద్ పక్క ప్లాన్‌తో ముందుకు దూసుకుపోతున్నారు. పార్టీని వీడిన తర్వాత తొలిసారిగా త‌న సొంత రాష్ట్ర‌మైన జమ్మూ కాశ్మీర్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంత‌రం సైనిక్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడుతూ.. తాను జమ్మూ కాశ్మీర్ ప్రజలకు అండగా ఉంటానని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పేరు చెప్పకుండా ప‌రోక్షంగా కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనను ఎప్పటి నుండో భూస్థాపితం చేశారని, అయితే తాను ప్రత్యేక పార్టీ పెట్టడం వల్ల‌ కొందరికి కోపం వచ్చిందన్నారు. కాంగ్రెస్ మన రక్తం, చెమటతో ఏర్పడిందని గులాం నబీ ఆజాద్ అన్నారు. 

మాజీ ముఖ్యమంత్రి సభా వేదిక వద్దకు చేరుకునే ముందు భారీ సంఖ్యలో జనం ఆయనకు స్వాగతం పలికారు. ఆజాద్ త‌న మద్దతుదారులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ర్యాలీ వేదిక వద్ద పోడియం ఎక్కే ముందు వేదికపై తన మద్దతుదారులు, సహచరులతో సమావేశమయ్యారు.

 కాంగ్రెస్‌ను ఉద్దేశించి గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. తాను ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేసినందుకు కొంద‌రు (కాంగ్రెస్) కోపంగా ఉన్నారనీ, తాను ఎప్పుడూ గ్రౌన్దేడ్. తాను ఎవరికీ చెడుగా మాట్లాడనని అన్నారు. కొత్త పార్టీ పేరుపై నేను ఇంకా నిర్ణయం తీసుకోలేదనీ, జమ్మూ కాశ్మీర్ ప్రజలే పేరు, జెండాను నిర్ణయిస్తారనీ, అందరికీ అర్థమయ్యేలా నా పార్టీకి హిందూస్థానీ అని పేరు పెడతాననీ అన్నారు. పూర్తి రాజ్యాధికారం, భూమి హక్కులు, స్థానికులకు ఉపాధి పునరుద్ధరణ వంటివి త‌న నూత‌న పార్టీ ప్రధాన అంశాలని అన్నారు. ఈ సంద‌ర్భంగా 1978 లో ఇందిరా గాంధీ అరెస్టుకు సంబంధించిన ఒక ఉదంతాన్ని గులాం నబీ ఆజాద్ వివరించారు. తన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ..ఇందిరాజీ ఒక వారంలో విడుదలయ్యారు. అయితే మమ్మల్ని 20 ఆగస్టు 1988న అరెస్టు చేసి.. జనవరిలో విడుదల చేశారు. ఆ స‌మ‌యంలో ఎవ‌రూ కూడా బెయిల్ ఇవ్వ‌లేద‌ని తెలిపారు. సిమెంటు నేలపై దుప్పటి వేసుకుని ప‌డుకునే వాడిన‌నీ, తినడానికి కేవ‌లం రెండు చపాతీలే ఇచ్చే వార‌ని త‌న జైలు జీవితాన్ని గుర్తు చేసుకున్నారు.

కాంగ్రెస్ మ‌న‌ రక్తం, చెమటతో తయారైంది

అలాగే.. గులాం నబీ ఆజాద్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ను మేమే స్థాపించాం. మా రక్తం, చెమటతో పార్టీని తయారుచేశాం.. ట్విట్టర్‌తో తప్పుడు పుకార్లు వ్యాప్తి చేయడం, అన్లైన్లో మెసేజ్ పోస్టులు పెట్ట‌డం వ‌ల్ల వ‌చ్చింది కాదు. మనల్ని అప్రతిష్టపాలు చేసే వారి రీచ్ కేవలం ఆన్‌లోనే ఉంటుంది అని అన్నారు. అవహేళన చేస్తూ.. 'అల్లా మాకు భూమిని ప్రసాదించుగాక, ఆయనకు ట్విట్ అదృష్టాన్ని కలుగజేయుగాక' అని ఆజాద్ అన్నారు.