ఇద్దరు యువకులు స్వలింగ సంపర్కంలో పాల్గొన్నారు. కాగా... దానిని మరో ఇద్దరు యువకులు వీడియో తీసి.. అనంతరం దానిని ఆన్ లైన్ లో పోస్టు చేశారు. కాగా.. సదరు నలుగురు యువకులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

సదరు నలుగురు యువకులు సతీష్(18), అభినేష్(19) మరో ఇద్దరు మైనర్లుగా గుర్తించారు. ఆ ఇద్దరు మైనర్ల వయసు 17 సంవత్సరాలు ఉంటాయని పోలీసులు చెప్పారు.

వీరు స్వలింగ సంపర్కంలో పాల్గొన్న వీడియోని ఆన్ లైన్ లో పెట్టడంతో కొందరు వీక్షించారు.వెంటనే చైల్డ్ లైన్ ఫిర్యాదు చేశారు. వారు దానిని పరిశీలించి పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు రంగంలోకి దిగి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

కాగా.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందని పోలీసులు చెప్పారు. వెంటనే ఆ వీడియోని తొలగించినట్లు చెప్పారు. నిందితులు నలుగురు ఓకే ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వారు చెప్పారు. ఆదివారం రాత్రి వారిని గుర్తించి అరెస్టు చేసినట్లు చెప్పారు. 

నలుగురు నిందితుల్లో ఇద్దరిని జుడిష్యల్ కస్టడీకి తరలించగా.. ఇద్దరు మైనర్లను చైల్డ్ హోమ్ కి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.