పాట్నా:బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా సోమవారం నాడు కన్నమూశారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. న్యూఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు.

బీహార్ రాష్ట్రానికి జగన్నాథ్ మిశ్రా మూడు దఫాలు సీఎంగా పనిచేశారు.  బీహార్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేసిన చివరి సీఎం కూడ ఆయనే.ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో  జగనాథ్ మిశ్రా సోదరుడు నారాయణ్ మిశ్రా  రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు.

బీహార్ యూనివర్శిటీలో  జగన్నాథ్ మిశ్రా ఆర్ధిక శాస్త్ర నిపుణుడిగా  పనిచేశారు. ఆ తర్వాత ఆయన  రాజకీయాల్లోకి వచ్చారు.పశు దాణా కుంభకోణంలో  జగన్నాథ్ మిశ్రా నిందితుడుగా ఉండేవాడు. 

రాంచీ కోర్టు ఆయనను నిర్ధోషిగా ఇటీవలనే ప్రకటించింది.జగన్నాథ్ మిశ్రా కాంగ్రెస్ ను వీడి ఎన్‌సీపీ, ఆ తర్వాత జనతాదళ్ (యూ)లో చేరారు.జగన్నాథ్ మిశ్రా తనయుడు నితీష్ మిశ్రా నితీష్ కుమార్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు.