అయోధ్యలో యాత్రికుల కోసం.. 22 దేశీయ, 6 విదేశీ భాషల్లో సైన్ బోర్డులు..

రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి అయోధ్య అంగరంగవైభవంగా ముస్తాబవుతోంది. దేశవిదేశీ పర్యాటకుల సౌకర్యం కోసం అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. 
 

For pilgrims in Ayodhya, 22 domestic and 6 foreign language signboards - bsb

అయోధ్య : పర్యాటకులు, యాత్రికుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. దేశవిదేశాల నుంచి అయోధ్యకు వచ్చే యాత్రికులు భాషతో ఇబ్బంది పడకుండా అనేక భాషల్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పర్యాటకుల సౌకర్యార్థం అయోధ్యలో ఏర్పాటు చేస్తున్న కొత్త ప్రయత్నాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.  అదే క్రమంలో అయోధ్యలో రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లోని 22 భారతీయ భాషలతో పాటు ఐక్యరాజ్యసమితిలోని ఆరు భాషల్లో సూచికలను ఏర్పాటు చేసే పని ప్రారంభమైంది. 

For pilgrims in Ayodhya, 22 domestic and 6 foreign language signboards - bsb

దీంతో అయోధ్యకు వచ్చే దేశ, విదేశీ పర్యాటకులు తాము వెళ్లాల్సిన, చూడాల్సిన ప్రాంతాల విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఇప్పటి వరకు హనుమాన్‌గర్హి, కనక్ భవన్, రామ్ కీ పైడి, అయోధ్య ధామ్ జంక్షన్, తేది బజార్, అయోధ్య ఎయిర్‌పోర్ట్‌లో సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. మరికొన్ని చోట్ల ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏది ఏమైనా జనవరి 22లోపు ఇవి పూర్తవుతాయి.

రామమందిర ప్రాణ్ ప్రతిష్ట : 11 రోజుల ప్రత్యేక ఆచారాలపై ప్రధాని మోదీ ఆడియో సందేశం..

సైన్ బోర్డులు ఏర్పాటు చేసే మరికొన్ని ప్రదేశాలు ఇవే...
రామ్ కీ పైడి, నాగేశ్వర్ నాథ్ ఆలయం, భజన్ సంధ్యా స్థల్ నయా ఘాట్, క్వీన్ హో పార్క్, లతా మంగేష్కర్ చౌక్, రాంపథ్, జన్మభూమి మార్గం, భక్తిపథ్, ధర్మపథ్, చౌదరి చరణ్ సింగ్ ఘాట్, రామకథా మ్యూజియం, జానకీ మహల్, దశరథ్ మహల్, రాంకోట్యాల్, రాంకోట్యాల్, రాంకోట్, ఛోటీ దేవ్‌కాళి ఆలయం, సరయూ ఘాట్, సూర్య కుండ్, గుప్తర్ ఘాట్, గులాబ్ బారి, కంపెనీ గార్డెన్, సాకేత్ సదన్, దేవాలయం సమీపంలో గుప్తర్ ఘాట్, చౌదరి చరణ్ సింగ్ పార్క్, సంత్ తులసి ఘాట్, తివారీ మందిర్, తులసి ఉద్యాన్, గోరఖ్‌పూర్-లక్నో బైపాస్, బైకుంత్ ధామ్, మిథిలా ధామ్, అయోధ్య ఐ హాస్పిటల్, హనుమాన్ గర్హి రోడ్, రాజ్‌ద్వార్ మందిర్ తిరహా, కనక్ భవన్ రోడ్, దిగంబర్ జైన్ టెంపుల్, శ్రీ రామ్ హాస్పిటల్, రామ్ కచేరీ, రంగ్‌మహల్, అమావా రం మందిర్, సీతాకుండ్, మణి పర్వతం, అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్‌లలో ఆయా భాషల్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేసే ప్రక్రియ వేగంగా జరుగుతోంది.

సైన్ బోర్డుల్లో ఏ ఏ భాషలు ఉండబోతున్నాయంటే..
భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ లో ఉన్న.. అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్ వంటి ఆరు ఐక్యరాజ్యసమితిలోని ఆరు భాషలలో ఫలకాలు అమర్చబడ్డాయి. ఇది కాకుండా హిందీ, ఉర్దూ, అస్సామీ, ఒరియా, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, గుజరాతీ, డోగ్రీ, తమిళం, తెలుగు, నేపాలీ, పంజాబీ, బెంగాలీ, బోడో, మణిపురి, మరాఠీ, మలయాళం, మైథిలీ, సంతాలి, సంస్కృతం సింధీలో బోర్డులు ఏర్పాటు చేయబడుతున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios