Asianet News TeluguAsianet News Telugu

30 ఏళ్ల తర్వాత అభిమాన ఉపాధ్యాయురాలిని కలిసిన ఫ్లైట్ అటెండెంట్.. చిన్న పిల్లలా ఎమోషనల్.. వీడియో వైరల్‌ 

అనుకోకుండా ఓ ఫ్లైట్ అటెండెంట్ 30ఏళ్ల తర్వాత తన అభిమాన ఉపాధ్యాయురాలిని కలిసింది. అది కూడా ఆమె డ్యూటీ చేస్తున్న విమానంలోనే. అనుకోకుండా.. తన ఇష్టమైన టీచర్ ను 30 ఏండ్ల తరువాత చూసే సరికి భావోద్వేగానికి గురైంది. ఇందుకు సంబంధించిన  వీడియో వైరల్ అవుతోంది. నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. 

Flight Attendant Meets Her Favourite Teacher On Airplane After 30 Years
Author
First Published Oct 25, 2022, 3:22 AM IST

సోషల్ మీడియాలో ప్రతిరోజూ చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే.. కొన్ని వీడియోలు మాత్రమే మన మనసుకు అతుకుంటాయి. మనల్ని  భావోద్వేగానికి గురి చేశాయి. తాజాగా అలాంటి ఓ వీడియో వైరల్ అవుతోంది. నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతూ.. నెటిజన్ల గతాన్ని గుర్తు చేస్తుంది. వారిని కంటతడి పెట్టిస్తుంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది? ఎందుకు అంతా ఎమోషనల్ అవుతున్నారని ఆలోచిస్తున్నారా? ..

ఆ వీడియోలో ఓ ఫ్లైట్ అటెండెంటర్ 30 ఏళ్ల తర్వాత తన అభిమాన ఉపాధ్యాయురాలిని కలిసింది. అది కూడా ఆమె డ్యూటీ చేస్తున్న విమానంలోనే. అనుకోకుండా.. తన ఇష్టమైన టీచర్ ను 30 ఏండ్ల తరువాత చూసే సరికి భావోద్వేగానికి గురైంది. చిన్న పిల్లలా కన్నీళ్లు పెట్టుకుంది. తన ఫేవరేట్ టీచర్‌ ని గట్టిగా హాగ్ చేసుకుని కృతజ్ఞతలు తెలుపుతూ కనిపించింది.

నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోను గుడ్‌న్యూస్_మూవ్‌మెంట్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా షేర్ చేయబడింది. ఫ్లైట్ అటెండెంట్ లారా రెన్ ఈ నెల ప్రారంభంలో ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తన అభిమాన ఉపాధ్యాయురాలు మిస్ ఓ'కానెల్‌ను కలిశారు.30 ఏళ్లుగా తన టీచర్‌ను చూసిన లారీ భావోద్వేగానికి గురయ్యారు. లారా తన విమానంలో కూర్చున్న ప్రయాణికులతో తన కథను పంచుకుంటూ భావోద్వేగ ప్రసంగం చేసింది.
 
లారా మాట్లాడుతూ.. మిస్ ఓ'కానెల్‌ నాకు ఇష్టమైన ఉపాధ్యాయురాలు.నేను ఆమెను 1990 నుండి చూడలేదు. ఆమె  నాకు షేక్స్పియర్ను ప్రేమించడం నేర్పింది. పియానో ​​వాయించడం నేర్పింది. ఆమె వల్లనే  పియానో ​​మాస్టర్ వచ్చింది.నేను వారిపై ఒక వ్యాసం రాయగలను. మిస్ ఓ'కానెల్ ధన్యవాదాలు. టీచర్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ చాలా ఎమోషనల్ అయింది. ఆ తర్వాత లారా తన టీచర్ వద్దకు వెళ్లి ఆమెను కౌగిలించుకుంది. ఈ సీన్ మొత్తం చాలా ఎమోషనల్ గా సాగింది. ఈ ఘటనను చూసిన ప్రయాణీకులు కూడా భావోద్వేగానికి గురయ్యారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోపై యూజర్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఓ నెటిజన్ ఇలా రాశాడు. వీడియో చూసి తాను నిజంగా ఏడుస్తున్నాననీ, తాను కూడా ఓ ఉపాధ్యాయుడిని. తన  విద్యార్థులు తిరిగి వచ్చి తనను విష్ చేయాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. మరొక నెటిజన్ ఇలా వ్రాశాడు, పది సంవత్సరాల తర్వాత.. తన హైస్కూల్ ఆర్ట్ టీచర్‌ని మళ్లీ కలవడం అదృష్టంగా భావిస్తున్నని, తాను సోషల్ మీడియా ద్వారానే తన టీచర్ ను కలిసినట్టు పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios