Asianet News TeluguAsianet News Telugu

దారుణం : ఐదేళ్ల బాలికపై గ్యాంగ్ రేప్.. సజీవంగా మట్టిలో పాతిపెట్టి.. చివరికి...

ఇంటిముందు ఆడుకుంటున్న ఓ చిన్నారిని ముగ్గురు యువకులు ఎత్తుకెళ్లారు. ఆ చిన్నారి మీద దారుణంగా గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఆ తరువాత చనిపోయిందనుకుని మట్టిలో పాతిపెట్టారు.

Five-year-old girl was gang-raped, buried alive in uttarpradesh - bsb
Author
First Published Jul 27, 2023, 10:50 AM IST

ఉత్తర ప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ లో అత్యంత హేయనీయమైన ఘటన వెలుగు చూసింది. చిన్నా,పెద్దా తేడా లేకుండా మహిళ అయితే చాలు కామంధులు రెచ్చిపోతున్నారు. వావివరసలు, ఉచ్ఛనీచాలు మరిచి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. దొరికిపోతామన్న భయంతో ఆ తర్వాత చేసే ఘోరాలు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటున్నాయి. ఇలాంటి ఘటనలను అరికట్టడానికి ఎన్ని కఠినమైన చర్యలు తీసుకుంటున్నా... ఫలితం లేకుండా పోతోంది.

ఉత్తరప్రదేశ్లో ఐదేళ్ల బాలికపై ముగ్గురు దుర్మార్గులు దాని గ్యాంగ్ రేప్ పాల్పడ్డారు. దారుణమైన ఈ ఘటనలో బాలిక స్పృహ కోల్పోగా చనిపోయిందనుకొని బ్రతికుండగానే మట్టిలో పాతిపెట్టేశారు. ఉత్తరప్రదేశ్ లోని బారాబాంకీ జిల్లా రాంనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణమైన ఘటన వెలుగు చూసింది.

స్మశానంలో లవ్ మ్యారేజ్.. పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహ వేడుక.. ఎందుకంటే ?

ఐదేళ్ల చిన్నారి ఇంటిముందు ఆడుకుంటుందని ఆమె తల్లి చెప్పింది. అదే సమయంలో అక్కడికి రింకూ, లవ్ కుశ్, అమ్రేష్ అనే ముగ్గురు  యువకులు వచ్చారు. చిన్నారికి ఏవో మాయమాటలు చెప్పి అక్కడి నుంచి ఆమెని తమతో పాటు తీసుకెళ్లారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన తర్వాత చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆ తర్వాత చిన్నారి చనిపోయిందనుకొని.. అక్కడే మట్టిలో పాతిపెట్టి ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు. ఇంటి ముందు ఆడుకుంటున్న కూతురు కనిపించకపోవడంతో తల్లి అంతటా వెతికింది. ఎక్కడా కూతురి ఆచూకీ లభించలేదు. దీంతో ఏమి చేయలేని పరిస్థితుల్లో తల్లి పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులకి ముగ్గురు యువకులు బాలికను తీసుకువెళ్లినట్లుగా తెలిసింది.  

ఈ ఘటన మీద బారాబాంకి అదనపు పోలీస్ సూపరిండెంట్ ఈ విధంగా తెలిపారు. మంగళవారం రాత్రి తమకు బాలిక మిస్సింగ్ అయిందన్న విషయం తెలిసిందన్నారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారని..  బాలిక మిస్సింగ్ మీద విచారణ చేపట్టారని తెలిపారు. అయితే, బాలిక అపహరణలో రింకూ హస్తం ఉందని అనుమానించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా జరిగిన విషయం తెలిసిందని చెప్పుకొచ్చారు.  

బాలికను ఎక్కడైతే పాతిపెట్టారో అక్కడికి తీసుకువెళ్లాడని పోలీసులు అన్నారు. అయితే బాలిక అప్పటికి సజీవంగానే ఉంది. వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన నిందితుల మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు 

Follow Us:
Download App:
  • android
  • ios