చెన్నై తేనాంపేట రోడ్డులోని డీఎంకే ప్రధాన కార్యాలయం ముందు బైకర్లు రెచ్చిపోయారు. ప్రమాదకర విన్యాసాలు చేసిన ఐదుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన బినోస్ ని ప్రధాన నిందితుడుగా గుర్తించారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
రోడ్డుపై వాహనాన్ని నడిపేటప్పుడు కచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే.. ట్రాఫిక్స్ రూల్స్ ఉల్లంఘించిన వారు ఖచ్చితంగా శిక్షార్హులే.. అయినా కొంతమంది అకతాయిలు రూల్స్ ను అతిక్రమిస్తుంటారు. పెనాల్టీలు చెల్లిస్తుంటారు. అత్యవసర పరిస్థితుల్లో రూల్స్‌ను అతి క్రమిస్తే.. మరికొందరు కావాలనే నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ.. ట్రాఫిక్ నిబంధనలకు అతిక్రమిస్తారు. అలాంటి వారిని పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టారు.
తాజాగా.. ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తూ చెన్నైలో ప్రమాదకరమైన బైక్ స్టంట్లు చేసినందుకు ఐదుగురు బైకర్లు సిటీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు హైదరాబాద్‌కు చెందిన బినోస్ పరారీలో ఉన్నాడని, అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
వివరాల్లోకెళ్తే.. శుక్రవారం అర్థరాత్రి చెన్నైలోని తెయ్‌నామ్‌పేట్‌లో ఉన్న ద్రవిడ మున్నేట్ర కజహగం (DMK) ప్రధాన కార్యాలయానికి ఎదురుగా ఉన్న టేనాంపేట్ రహదారిపై బైకర్ల ముఠా ప్రమాదకరమైన విన్యాసాలు చేశారు. పలువురు తీవ్ర అంతరాయం కలిగించారు. రాష్ డ్రైవింగ్ చేస్తూ.. స్థానికులను భయాందోళనకు గురి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. బైకర్ల పోకిరీ చేష్టాలు చూసి నెట్టిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసిన వారి ఆధారంగా ముఠాపై చర్యలు తీసుకోవాలని పలువురు పోలీసులను ఆశ్రయించారు.
దీంతో పోలీసులు వారిపై కేసు నమోదుచేశారు. వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకూ ఐదుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిని రాయపేటకు చెందిన పెట్రోల్ మాలిక్, సెంబియంకు చెందిన ఇమ్రాన్ ఖాన్, ముఖేష్, తిరుపత్తూరుకు చెందిన మహ్మద్ హరీస్, మహ్మద్ సైఫాన్‌లుగా గుర్తించారు. ప్రధాన నిందితుడు హైదరాబాద్‌కు చెందిన బినోస్ కోసం కూడా పోలీసులు వెతుకుతున్నారు, తదుపరి విచారణ కొనసాగుతోంది.
