మానవ మృగాలు.. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. ప్రియుడితో సహా ఐదుగురు స్నేహితుల అరెస్టు
కేరళలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో ప్రియుడితో సహా ఐదుగురు స్నేహితులను అరెస్టు చేశారు.

మానవత్వం రోజురోజుకు మంట కలిసిపోతుంది. వయసుతో సంబంధం లేకుండా ఆడవారు కనిపిస్తే చాలు.. కామాంధులు అఘాయిత్యానికి ఒడిగడుతున్నారు. తాజాగా కేరళలోదారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో అతడి స్నేహితులు ఓ మైనర్ బాలికపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని ఎవరి చెప్పుకోవాలో తెలియక దాదాపు సంవత్సర కాలం పాటు తనలో తాను నరకయాతన అనుభవించింది. కేరళలోని అదూర్ లో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
గత డిసెంబర్ నుంచి మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడుతూ కామాంధుడు తమ లైంగిక వాంఛ తీర్చుకున్నారు. బాధితురాలు ఎట్టకేలకు ఈ విషయాన్ని బయట పెట్టడంతో ప్రియుడితో సహా ఐదుగురు యువకులను అరెస్టు చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 17 ఏళ్ల బాలికపై ఆమె ప్రియుడు.. తన సన్నిహితులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రియుడు సుమేష్ (19), అతని స్నేహితులు శక్తి (18), అనూప్ (22), అభిజీత్ (20), అరవింద్ (28)లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీతో జరిగిన సంప్రదింపుల సమావేశంలో ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులకు సమాచారం అందించారు.
ఫిర్యాదు అందిన వెంటనే బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేసామనీ, ఆమెను వైద్య పరీక్షలకు పంపి కేసు నమోదు చేసామని పోలీసులు తెలిపారు. పోలీసులు ఈ విషయంలో గ్యాంగ్ రేప్ సహా నాలుగు కేసులు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొదటి అత్యాచారం గతేడాది డిసెంబర్ లో జరిగినట్టు బాధితురాలు తెలిపింది. తొలుత తన ప్రియుడి స్నేహితుడు శక్తి అనే యువకుడు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. ఆ తర్వాత బాలిక సన్నిహితుడైన అనూప్ కూడా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న అనూప్,అభిజీత్ ,అరవింద్ అనే యువకుడు ఆమెను బ్లాక్ మొయిల్ చేసి..పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జులై మొదటి వారంలో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.