Asianet News TeluguAsianet News Telugu

ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. కొవిడ్ వార్డులో మంటలు, మహిళా రోగి సజీవదహనం

బుర్ద్వాన్ మెడికల్ కాలేజీకి (burdwan medical college) అనుబంధంగా ఉన్న ఆస్పత్రిలో శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కొవిడ్ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రోగులు పరుగులు తీశారు. చూస్తుండగానే.. మంటలు వార్డు మొత్తం వ్యాపించాయి. 

fire breaks out at burdwan medical college covid ward patients died
Author
Kolkata, First Published Jan 29, 2022, 5:15 PM IST

దేశంలో కరోనా వైరస్ (coronavirus) థర్డ్‌ వేవ్ (third wave) ఉద్దృతంగా సాగుతున్న వేళ.. ఆస్పత్రుల్లో చేరికలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అగ్నిప్రమాద ఘటనలు కలకలం రేపుతున్నాయి. తొలి, రెండో దశలో (second wave) ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాల కారణంగా పెద్ద సంఖ్యలో రోగులు చనిపోయిన ఘటనలు కూడా వున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని బర్ద్వాన్ మెడికల్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కొవిడ్ వార్డులో మంటలు చెలరేగడంతో ఓ రోగి ప్రాణాలు కోల్పోయింది. 

బుర్ద్వాన్ మెడికల్ కాలేజీకి (burdwan medical college) అనుబంధంగా ఉన్న ఆస్పత్రిలో శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కొవిడ్ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రోగులు పరుగులు తీశారు. చూస్తుండగానే.. మంటలు వార్డు మొత్తం వ్యాపించాయి. దాదాపు కదల్లేని స్థితిలో ఒక కొవిడ్ రోగి మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయింది. 

ఆమెను తూర్పు బుర్ద్వాన్ జిల్లాకు చెందిన సంధ్యా రాయ్ (60)గా గుర్తించారు. మంటలను గుర్తించిన వెంటనే అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించామని బుర్ద్వాన్ మెడికల్ కాలేజీ అధికారులు మీడియాకు తెలిపారు. కొవిడ్ వార్డులో మంటలను అదుపు చేయడానికి దాదాపు గంట సమయం పట్టిందని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. కాగా, నిర్వహణ వైఫల్యాన్ని అంగీకరించడానికి బుర్ద్వాన్ ఆస్పత్రి వర్గాలు నిరాకరించాయి. అయితే అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే కారణాన్ని తెలుసుకోవడానికి ఐదుగురు సభ్యుల దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని, ఫోరెన్సిక్ విచారణ కూడా జరుగుతోందని బుర్ద్వాన్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ప్రిన్సిపల్ ప్రబీర్ సేన్‌గుప్తా తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios