హర్యానాలో అమానుషమైన సంఘటన చోటు చేసుకుంది. కన్న కూతురిపైనే ఓ వ్యక్తి ఏడేళ్లుగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. చివరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది.

చండీగఢ్: హర్యానాలో మానవత్వానికి మచ్చ తెచ్చే సంఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రి కూతురిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన హర్యానాలో జరిగింది. రాష్ట్రంలోని హిసార్ నగరంలో 17 ఏళ్ల బాలికపై కన్నతండ్రి ఏడేళ్లుగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గత ఏడేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతూ శారీరకంగా, మానసికంగా తండ్రి వేధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. దీంతో బలవంతంగా ఆమెకు గర్భస్రావం చేయించాడు. 

అంతేకాకుండా, 11 ఏళ్ల వయస్సు గల మరో కూతురిపై కూడా అతను లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనపై బాధితురాలు హిసార్ మహిళా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దానివల్ల సంఘటన వెలుగులోకి వచ్చింది. 

గత ఏడేళ్లుగా తనపై తండ్రి అత్యాచారానికి పాల్పడుతున్నాడని బాధితురాలు చెప్పింది. అతన్ని ప్రతిఘటించినప్పుడు చంపేస్తానని బెదిరించాడని చెప్పింది. బాధితురాలు వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.