Asianet News TeluguAsianet News Telugu

రైతుల అపోహలు పోగొడతాం.. అమిత్ షా


కనీస మద్దతు ధర, మార్కెట్ కమిటీల గురించి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆయా సీఎంలతో రైతులకు భరోసా కల్పిస్తామని అన్నారు. అయితే నూతన చట్టాలను మాత్రం వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని అమిత్‌షా తేల్చి చెప్పారు. 

Farmers Say Will Attend Talks Today, Claim No Conditions From Centre
Author
Hyderabad, First Published Dec 1, 2020, 1:52 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లును రైతులంతా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులంతా కలిసి ఛలో ఢిల్లీ కార్యక్రమం కూడా చేపట్టారు. కాగా..వారి ఆందోళనలకు తాజాగా కేంద్రం కిందకు దిగివచ్చింది.  ఈరోజు మధ్యాహ్నం రైతులతో కేంద్ర మంత్రులు చర్చలు జరపనున్నారు. కాగా.. దీనిపై తాజాగా అమిత్ షా స్పందించారు.

నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తేల్చి చెప్పారు. నూతన చట్టాలపై రైతుల్లో ఉన్న అపోహలను, భయాలను దూరం చేస్తామని, అందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమిత్‌షా పేర్కొన్నారు. అలాగే కనీస మద్దతు ధరపై కూడా రైతులకు భరోసా ఇస్తామని ఆయన తెలిపారు. 

కనీస మద్దతు ధర, మార్కెట్ కమిటీల గురించి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆయా సీఎంలతో రైతులకు భరోసా కల్పిస్తామని అన్నారు. అయితే నూతన చట్టాలను మాత్రం వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని అమిత్‌షా తేల్చి చెప్పారు. మరోవైపు రైతులతో కేంద్ర ప్రభుత్వం మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు చర్చలు జరపనుంది. 

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో విజ్ఞాన్ భవన్‌లో చర్చలు జరగనున్నాయి. రైతులు తమ నిరసనను ఉద్ధృతం చేసిన నేపథ్యం, చర్చల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంట్లో కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్, తోమర్ సమావేశమయ్యారు. రైతులతో చర్చించాల్సిన అంశాలు, చర్చలు ఎలా జరిగితే ఆందోళనను విరమిస్తారన్న అంశాలను వీరు చర్చించినట్లు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios