ఓ రైతు వ్యవసాయం కోసం బ్యాంక్ ద్వారా రుణం తీసుకున్నాడు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అతడు దానిని తిరిగి చెల్లించలేపోయాడు. రుణం చెల్లించకుండానే మరణించాడు. దీంతో బ్యాంకు అధికారులు ఆ రైతు‌కు చెందిన భూమిని వేలం వేశారు. 

ఓ రైతు వ్యవసాయం కోసం బ్యాంక్ ద్వారా రుణం తీసుకున్నాడు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అతడు దానిని తిరిగి చెల్లించలేపోయాడు. రుణం చెల్లించకుండానే మరణించాడు. దీంతో బ్యాంకు అధికారులు ఆ రైతు‌కు చెందిన భూమిని వేలం వేశారు. అతని కుటుంబ సభ్యుల అభ్యర్థనను కూడా బ్యాంకు అధికారులు తోసిపుచ్చారు. ఈ ఘటన దయానీయమైన ఘటన రాజస్తాన్‌లోని దౌసా జిల్లాలోని రామ్‌గఢ్ పచ్వారా గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. కాజోద్ మీనా అనే రైతు Rajasthan మరుధర గ్రామీణ బ్యాంక్ నుంచి రుణం తీసుకున్నాడు. అయితే ఆ రుణం చెల్లించడంలో విఫలమయ్యాడు. అయితే loan amount చెల్లించకుండానే అతడు మరణించాడు. 

దీంతో బ్యాంకు అధికారులు.. రైతు కాజోద్ మీనా కొడుకులు రాజులాల్‌, పప్పులాల్‌లకు రుణం తీసుకన్న డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి పలుమార్లు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో రైతు కుమారులు డబ్బులు తిరిగి చెల్లించలేకపోయారు. అయితే రాజస్తాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ హామీ నేపథ్యంలో వారు ప్రభుత్వం నుంచి మాఫీ జరుగుతుందనే ఆశతో ఉన్నారు. 

ఈ క్రమంలోనే రైతు రుణం తీసుకున్న 15 బిఘాల భూమిని బ్యాంక్ అధికారులు అటాచ్ చేశారు. అనంతరం ఆ భూమిని మంగళవారం వేలం వేశారు. వేలంలో ఆ భూమి రూ. 46 లక్షలకు అమ్ముడుపోయింది. తహసీల్ కార్యాలయంలో ఈ వేలం ప్రక్రియ పూర్తయింది. ‘ఆ రైతు రాజస్తాన్ మరుధర గ్రామీణ బ్యాంకులో రుణం తీసుకున్నా తిరిగి చెల్లించలేకపోయాడు. బ్యాంక్ కూడా వారిని సెటిల్‌మెంట్ కోసం పిలిచింది. కానీ వారు కనిపించలేదు.. కాబట్టి చట్టం ప్రకారం వారి భూమిని వేలం వేయబడింది’ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ మిథ్లేష్ మీనా (Mithlesh Meena) తెలిపారు. 

రైతు కుమారుడు పప్పు లాల్ మాట్లాడుతూ.. ‘మా నాన్న అప్పు తీసుకున్నాడు, ఇప్పుడు చనిపోయాడు. మేము దానిని తిరిగి చెల్లించలేకపోయాం. బ్యాంకు అధికారులను అభ్యర్థించాము. కానీ వారు అవకాశం ఇవ్వడానికి నిరాకరించారు’ అని తెలిపారు. భూమిని వేలం వేయడంతో రైతు కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది.

అయితే రైతు రుణమాఫీ పలు పార్టీలు హామీలు ఇస్తున్నాయి. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడంలో కొన్ని సందర్భాల్లో విఫలమవుతున్నాయి. నేతలు తమ ప్రసంగాలలో రుణమాఫీ గురించి ఉదరగొడుతున్న క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి. తాజా ఘటన కూడా ఇందుకు అద్దం పట్టేలా ఉంది. ఈ ఘటనపై స్పందించిన బీజేపీ.. రాజస్తాన్‌లో రుణమాఫీ హామీతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ మూడేళ్లు గడుస్తున్నా నేటికి దానిని అమలు చేయలేదని విమర్శించింది.