ఉత్తరప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ పెళ్లింట్లో జరిగిన ప్రమాదంలో పదమూడు మంది బావిలో పడి చనిపోయారు. వీరిలో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. పాత బావిపై కప్పిన స్లాబ్ కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. 

ఉత్తరప్రదేశ్ : UttarPradeshలోని ఖుషీనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గత రాత్రి Wedding ceremony సందర్భంగా ఉల్లాసంగా ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు wellలో పడి మహిళలు, పిల్లలతో సహా 13 మంది మరణించారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, marriageలో మహిళలు, పిల్లలు పాత బావిని కప్పి ఉంచిన slabపై కూర్చున్నారు. బరువు ఎక్కువ కావడంతో స్లాబ్ కూలిపోయింది. దీంతో దానిమీద కూర్చున్న వారు బావిలో పడిపోయారు. వారిని వెంటనే బావిలో నుంచి తీసి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే 13 మంది మరణించినట్లు ధృవీకరించారు. 

దీంతో అప్పటివరకు ఎంతో సంతోషంగా, సరదాగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఏడుపులు, హాహాకారాలతో నిండిపోయింది. తమ ఆప్తులను కోల్పోయిన వారి రోదనలతో అక్కడ విషాదం అలుముకుంది. ఈ ఘటన మీద జిల్లా మెజిస్ట్రేట్ ఎస్ రాజలింగం మీడియాతో మాట్లాడుతూ, “ప్రమాదవశాత్తు బావిలో పడి 11 మంది మరణించారని, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు మాకు సమాచారం అందింది. చికిత్స తీసుకుంటూ గాయపడిన వారిద్దరూ మరణించడంతో మొత్తం చనిపోయినవారి సంఖ్య 13కు చేరింది. వివాహ కార్యక్రమంలో కొంతమంది బావి స్లాబ్‌పై కూర్చున్నప్పుడు... అధిక లోడ్ కారణంగా, స్లాబ్ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది" అని తెలిపారు.

ఈ ఘటనలో మరణించిన ఒక్కొక్కరి కుటుంబానికి రూ. 4 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని సీనియర్ అధికారి తెలిపారు. ఈ దుర్ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. తక్షణమే రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లు నిర్వహించి గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిక హ్యాండిల్ ట్వీట్ చేసింది. ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

నిరుడు జూలైలో భోపాల్ లో ఇలాంటి ఘటనే జరిగింది. బావిలో పడిన బాలుడిని రక్షించబోయి 30మంది బావిలో పడ్డారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదిశలో జులైలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బావిలో పడిన బాలుడిని రక్షించడానికి గ్రామస్తులు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో 30 మంది బావిలో పడ్డారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.

ఇక్కడ కూడా అంతే.. బాలుడిని రక్షించడానికి ప్రయత్నించిన వారి బరువును తట్టుకోలేక బావి కుప్ప కూలింది. దీంతో వారంతా బావిలో పడిపోయారు. విదిశకు 50 కిలోమీటర్ల దూరంలో గల గంజ్ బసోడా గ్రామంలో ఈ ప్రమాదం సంభవించింది. రాత్రంతా సహాయక చర్యలు కొనసాగుతూ వచ్చాయి.

బావిలో పడిన 20 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. మరో పది మంది ఇంకా బావిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, సంబంధిత అధికారులతో తాను ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నానని ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ చెప్పారు. 

నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ బలగాలు, రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్ మెంట్ బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. జోన్ ఇన్ స్పెక్టర్ జనరల్, ఇతర సీనియర్ అధికారుు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. బాధితులకు సరైన వైద్యం అందేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.