UP Assembly Election 2022: ఉత్తరప్రదేశ్ ఓటర్లను అప్రమత్తంగా ఉండాల‌ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హెచ్చరించారు. నకిలీ సమాజ్‌వాదీలు అధికారంలోకి వస్తే..  రైతుల ఖాతాల్లోకి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) జమ చేయకుండా ఆపేస్తార‌ని శుక్రవారం సమాజ్‌వాదీ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

UP Assembly Election 2022: ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల స‌మరం జోరుగా సాగుతోంది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ.. ప్రచార పర్వం జోరందుకుంది. ఇప్ప‌టికే అన్ని పార్టీల ప్ర‌ధాన నేత‌లు ప్ర‌చారంలో దిగారు. పోటా పోటీగా జరుగుతున్న ఎన్నిక స‌మ‌రంలో ఒకరిపై మరొకరు విమర్శాస్త్రాలు సంధించుకుంటున్నారు. తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు గుప్పించుకుంటున్నారు. 

మరికొద్ది రోజుల్లో తొలిదశ పోలింగ్‌కు ముందు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు.. తమ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. ఈ తరుణంలో ఉత్తర ప్రదేశ్ ఓటర్లు అప్రమత్తంగా ఉండాల‌ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హెచ్చరించారు. నకిలీ సమాజ్‌వాదీలు అధికారంలోకి వస్తే.. రైతుల ఖాతాల్లోకి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) జమ చేయకుండా ఆపేస్తార‌ని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సమాజ్‌వాదీ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని 'జన్ చౌపాల్'ని ఉద్దేశించి వర్చువల్‌గా ప్రధాని ప్రసంగిస్తూ, నకిలీ సమాజ్‌వాదీలు అధికారంలోకి వస్తే.. రైతులు పొందుతున్న వేల కోట్ల రూపాయలను ఆపుతారని, రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ఎంఎస్‌పి డబ్బు చేర‌కుండా చేస్తార‌ని ప్ర‌ధాని ఆరోపించారు.ఈ కోవిడ్ కాలం నుంచి మీకు లభిస్తున్న ఉచిత రేషన్ ను ఈ నకిలీ 'సమాజ్‌వాదీలు లాక్కుంటారని. ప్రజలను ఆకలితో ఉంచుతారని, రైతులకు అందిస్తున్న సాయాన్ని నిలిపేస్తారని ఆరోపించారు.

అల్లర్లకు పాల్పడేవారు, మాఫియా గ్యాంగులు రాష్ట్రంపై పట్టు సాధించేందుకు అనుమతించరాదని ప్రజలు నిర్ణయం తీసుకున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశలో ఫిబ్రవరి 10న పోలింగ్ జరిగే పశ్చిమ ఉత్తర ప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. 

‘‘ఓటు వేసేటపుడు.. చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ నాయకత్వంలోని నకిలీ సమాజ్‌వాదీలకు అవకాశం వస్తే.. రైతులకు అందుతున్న సాయాన్ని నిలిపేస్తారు. ఈ నకిలీ సమాజ్‌వాదీలు మిమ్మల్ని ఆకలితో ఉంచుతారు’’ అని ప్ర‌ధాని మోడీ హెచ్చరించారు. 
రాష్ట్రంలో భద్రత, గౌరవం, సౌభాగ్యాలను కొనసాగించడానికి, హిస్టరీ షీటర్లను బయట ఉంచడానికి, నూతన చరిత్రను సృష్టించడానికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. పుకార్లు, అబద్ధాలు వ్యాప్తి చేయడం తప్ప వారికి వేరే ఆయుధం లేదని అన్నారు.

డబుల్ ఇంజిన్-డబుల్ ప్ర‌భుత్వం..

సురక్ష, సమ్మాన్, సమృద్ధి గురించి గుర్తు చేస్తూ.. యుపిలో శాంతి సుస్థిరత కోసం ఈ ఎన్నికలు వ‌చ్చామ‌ని అన్నారు. రాష్ట్రంలో అల్లర్లు, మాఫియాలు యోగి ప్ర‌భుత్వం నియంత్రించింద‌ని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పటిష్టం చేసినందుకు యోగి ప్రభుత్వం తీసుకున్న చ‌ర్య‌ల‌ను ప్ర‌ధాని ప్ర‌శంసించారు. యూపీలో నేరగాళ్ళు అదుపులోకి వస్తారని ఎవరూ ఊహించలేదన్నారు. యూపీలో సీఎం యోగి
చట్టబద్ధ పాలనను నెలకొల్పారని ప్ర‌శ‌సించారు. 21వ శతాబ్దంలో.. యూపీకి రెట్టింపు వేగంతో నిరంతరం పనిచేసే ప్రభుత్వం అవసరమని, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మాత్రమే దీన్ని చేయగలదని ప్రధాని మోదీ అన్నారు. 

ఈ ఎన్నికలు చాలా ప్ర‌త్యేక‌మైన‌వి.. స్వాతంత్య్ర అనంత‌రం అనేకసార్లు ఎన్నికలు జరిగాయని, ప్రస్తుత ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని తెలిపారు. రాష్ట్రంలో శాంతి స్థాపన, అభివృద్ధి కొనసాగింపు, సుపరిపాలన, ప్రజలు వేగంగా అభివృద్ధి చెంద‌టం కోసం ఈ ఎన్నికలు జరుగుతున్నాయ‌ని చెప్పారు. 

సంక్షోభ సమయంలో సైతం...100 ఏళ్ళలో మానవాళి ఎరుగని విపత్తు కోవిడ్-19 రూపంలో వచ్చిందన్నారు. ఈ సంక్షోభ సమయంలో సైతం తాము డబుల్ ఇంజిన్ డబుల్ బెనిఫిట్స్‌ను ప్రజలకు అందేలా చేశామని చెప్పారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వమే.. రైతుల బ్యాంకు ఖాతాల్లో MSPని జమ చేస్తోంది. కోవిడ్-19 వ్యాక్సిన్‌ల గురించి పుకార్లు వ్యాప్తి చేసినట్లే.. ప్ర‌తిప‌క్షాలు MSP గురించి కూడా పుకార్లు వ్యాప్తి చేసారనీ వారికి అసత్యాలు, పుకార్లు మించిన ఆయుధం లేదని,అందుకే త‌ప్పుడు ప్రచారం చేస్తున్నారు.

\కానీ ప్రభుత్వం 2017కి ముందు ప్రభుత్వంతో పోలిస్తే.. MSP కొనుగోలును అనేక రెట్లు పెంచిందనీ, గ‌త ప్ర‌భుత్వాలు రెండు డజన్లకు పైగా చక్కెర మిల్లులను మూసివేయ‌ని గుర్తు చేశారు. మీరట్, ఘజియాబాద్, అలీగఢ్, హాపూర్, నోయిడా జిల్లాల ఓటర్లను ఉద్దేశించి ఈ వర్చువల్ రచ్చబండను బీజేపీ నిర్వహించింది.