డేటింగ్ యాప్ పేరుతో 16 మంది అమ్మాయిలతో కాల్ సెంటర్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. కోల్‌కతాలో ఉన్న కాల్‌సెంటర్‌పై దాడి చేసి అరెస్ట్ చేశారు. 16 మంది అమ్మాయిలకు 41 సీఆర్‌పీసీ సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు.

ఆనంద్ కర్, బుద్ధపాల్ అనే వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరు దేశవ్యాప్తంగా భారీగా మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. నిందితుల నుంచి రెండు ల్యాప్‌టాప్‌లు , 24 మొబైల్ ఫోన్లు , 51 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.