ఎలక్టోరల్ బాండ్లు.. 2019 నుంచి ఏ పార్టీకి ఎన్ని విరాళాలు వచ్చాయి ? టాప్ లో ఏ పార్టీ ఉంది ?
ఎలక్టోరల్ బాండ్ల పథకం ద్వారా అత్యధికంగా బీజేపీకి విరాళాలు అందాయి. రెండో స్థానంలో టీఎంసీ ఉండగా.. మూడో స్థానంలో కాంగ్రెస్ నిలిచింది. నాలుగో స్థానంలో బీఆర్ఎస్ నిలిచింది.
దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ పై చర్చ జరుగుతోంది. ఈ స్కీమ్ లో అవకతవకలు జరిగాయని, బీజేపీ బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. రాజకీయ పార్టీలకు విరాళాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2017లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ ఫిబ్రవరి 15వ తేదీన సుప్రీంకోర్టు కొట్టివేసింది.
కాగా.. 2019 నుంచి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వివిధ రాజకీయ పార్టీలకు రూ.12,769 కోట్లకు పైగా విరాళాలు అందాయి.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అందించిన ఎలక్టోరల్ బాండ్ల డేటాను ఎన్నికల సంఘం (ఈసీ) గురువారం బహిర్గతం చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గత ఐదేళ్లలో రాజకీయ పార్టీలు మొత్తం 20,421 ఎలక్టోరల్ బాండ్లను ఎన్ క్యాష్ చేసుకున్నాయి. వీటిలో రూ.కోటి విలువ చేసే 12,207 బాండ్లు ఉన్నాయి. 5,366 బాండ్లు (ఒక్కొక్కటి రూ.10 లక్షలు); 2,526 (ఒక్కొక్కరికి రూ.లక్ష); 219 బాండ్లు (ఒక్కొక్కటి రూ.10,000); 103 మందికి రూ.1,000 చొప్పున ఇచ్చారు.
ఈసీ వెబ్ సైట్ లో ఉన్న వివరాల ప్రకారం 2019 నుంచి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి అత్యధికంగా విరాళాలు సమకూరాయి. రెండో స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ నిలవగా, మూడో స్థానంలో కాంగ్రెస్ నిలిచింది. బీఆర్ఎస్ ఐదో స్థానంలో, బిజూ జనతాదళ్ ఆరో స్థానంలో నిలిచింది.
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ప్రతి రాజకీయ పార్టీ అందుకున్న విరాళాల లిస్ట్
పొలిటికల్ పార్టీ ఎలక్టోరల్ బాండ్స్ (కోట్లలో)
భారతీయ జనతా పార్టీ 6,060.50
తృణమూల్ కాంగ్రెస్ 1,609.50
కాంగ్రెస్ 1,421.90
భారత రాష్ట్ర సమితి 1,214.70
బిజూ జనతాదళ్ 775.50
ద్రావిడ మున్నేట్ర కళగం 639.00
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 337.00
తెలుగుదేశం పార్టీ 218.90
శివసేన 159.40
రాష్ట్రీయ జనతాదళ్ 72.50
ఆమ్ ఆద్మీ పార్టీ 65.50
జనతాదళ్ (సెక్యులర్) 43.50
సిక్కిం క్రాంతికారి మోర్చా 36.50
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 30.50
జనసేన పార్టీ 21.00
సమాజ్ వాదీ పార్టీ 14.10
జనతాదళ్ (యునైటెడ్) 14.00
జార్ఖండ్ ముక్తి మోర్చా 13.50
శిరోమణి అకాలీదళ్ 7.30
ఏఐఏడీఎంకే 6.10
సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ 5.50
రాష్ట్రీయ జనతా దళ్ 1.00
మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ 0.60
జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ 0.50
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర ప్రదేశ్ 0.50
గోవా ఫార్వర్డ్ పార్టీ 0.40