ED Raids in SDPI: నిషేధిత పిఎఫ్ఐ తో ఆర్థిక లావాదేవీలు జరుపుతోందన్న ఆరోపణలు నేపథ్యంలో ఎస్‌డీపీఐ పార్టీపై చర్యలు తీసుకుంటోంది ఈడి. ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడిని అరెస్ట్ చేయగా తాజాగా దేశంలోని కార్యాలయాలపై దాడులు జరుపుతోంది.
ED Raids in SDPI : దేశవ్యాప్తంగా ఎస్‌డీపీఐ కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేస్తోంది. వివిధ రాష్ట్రాల్లోని 14 ఎస్‌డీపీఐ ఆఫీసుల్లో ఈడి సోదాలు చేపట్టింది. ఢిల్లీలోని ఎస్‌డీపీఐ జాతీయ కార్యాలయంలో కూడా తనిఖీలు చేశారు. కేరళలో కూడా మూడు చోట్ల సోదాలు జరిగాయి. ఎస్‌డీపీఐపై జరుగుతున్న విచారణలో భాగంగా ఈ దాడులు చేస్తున్నారు.
నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) తో SDPIకి సంబంధాలు కలిగివుందన్న అనుమానాలున్నాయి. ఈ రెండింటి మధ్య ఆర్థిక లావాలేవీలు జరిగినట్లుగా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. దీంతో వెంటనే ఎస్‌డీపీఐ జాతీయ అధ్యక్షుడు ఎం.జె ఫైజీని అరెస్ట్ చేసింది ఈడి... ప్రస్తుత ఆయన ఈడి కస్టడీలోనే ఉన్నాడు. రెండ్రోజులుగా ఫైజీని విచారిస్తున్న ఈడి తాజాగా ఎస్‌డీపీఐ కార్యాలయాలపై దాడులు చేపట్టడం సంచలనంగా మారింది.
ఎస్‌డీపీఐ కార్యాలయాల్లోని కీలక డాక్యుమెంట్లు, ఇతర వస్తువులను ఈడి స్వాధీనం చేసుకుంది. అయితే ఎస్‌డీపీఐ ఆఫీసులపై ఈడి దాడులకు సంబంధించిన సమాచారం ఇంకా బయటకు రాలేదు.
