Earthquake : ఢిల్లీలో భూ ప్రకంపనలు.. వణికిన జనం , పాక్, ఆఫ్ఘన్లో భూకంపం
గురువారం ఢిల్లీలో పలు ప్రదేశాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో భూకంపం సంభవించింది. అలాగే పిర్ పంజాల్ దక్షిణ ప్రాంతంలోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
గురువారం ఢిల్లీలో పలు ప్రదేశాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ జిల్లా, పిర్ పంజాల్ దక్షిణ ప్రాంతంలోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదైంది. పంజాబ్, ఛండీగఢ్, ఘజియాబాద్‌లలోనూ భూకంపం సంభవించింది. ఇంట్లోని తలుపులు , కిటికీలు, సామాగ్రి కుదుపులకు గురికావడంతో ప్రజలు ప్రాణభయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ప్రధానంగా ఢిల్లీ రాజధాని ప్రాంతంలో సుమారు 30 సెకన్ల పాటు భూమి కంపించింది. భూ ప్రకంపనల ధాటికి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు.