ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ సమీపంలో మంగళవారం భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం 9.41 గంటలకు సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 3.9 గా నమోదైంది. హరిద్వార్ నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. కాగా.. భూమి కంపించగానే ప్రజలు భయంతో వణికిపోయారు. వెంటనే ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. 

 

ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని ఉత్తరాఖండ్ అధికారులు చెప్పారు. దీంతో.. ప్రజలు  ఊపిరిపీల్చుకున్నారు.  ఉత్తరాఖండ్ రాష్ట్రంలో  గతంలోనూ పలు సార్లు భూమి కంపించింది. పలుమార్లు ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయని అధికారులు  చెప్పారు.