ప్రయాగరాజ్‌లో ద్వాదశ మాధవ యాత్ర ... అంటే ఏమిటి?
దేవోత్థాన ఏకాదశి నుంచి ప్రయాగరాజ్‌లో ద్వాదశ మాధవ పరిక్రమ యాత్ర మొదలైంది. యోగి సర్కార్ సహకారంతో మొదలైన ఈ యాత్ర ప్రయాగలోని పురాతన ఆలయాలను ప్రజలకు చేరువ చేస్తుంది.
ప్రయాగరాజ్ : కుంభ నగరి ప్రయాగరాజ్ ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక స్వరూపానికి ప్రసిద్ధి. వివిధ ధార్మిక, పౌరాణిక సంప్రదాయాలకు నిలయంగా ఉంది. అయితే కాలక్రమేణా వివిధ ధార్మిక పద్దతులు మరుగున పడిపోయాయి. వీటిని గుర్తించి తిరిగి ప్రారంభించేలా సహకారం, ప్రోత్సాహం అందిస్తోంది యోగి సర్కార్. దేవోత్థాన ఏకాదశి నుంచి ప్రారంభమయ్యే ద్వాదశ మాధవ పరిక్రమ యాత్ర కూడా ఇలాంటిదే.
శ్రీ ద్వాదశ మాధవ పరిక్రమ యాత్ర ఆరంభం
కుంభ నగరి ప్రయాగరాజ్ పురాతన ఆలయాల నగరం. ద్వాదశ మాధవుల్లో ఒకరైన శ్రీ వేణి మాధవ ప్రయాగ నగర దేవతగా ప్రసిద్ధి. దీంతో దేవోత్థాన ఏకాదశి నుంచి ద్వాదశ మాధవ పరిక్రమ యాత్ర చేపడతారు. ప్రయాగరాజ్‌లోని పురాతన అనంత మాధవ ఆలయం నుంచి ఇది ప్రారంభమయ్యింది.. వివిధ మాధవ ఆలయాల ప్రముఖులు, అఖాడాల సన్యాసులు ఇందులో పాల్గొన్నారు.
శ్రీ అనంత మాధవ మహంత్ ఆదిత్యానంద్ జీ మాట్లాడుతూ... శ్రీ అనంత మాధవ నుంచి మొదలైన ఈ పరిక్రమ యాత్ర వివిధ మాధవ ఆలయాల మీదుగా శ్రీ చక్ర మాధవ, అరైల్‌లో ముగుస్తుందని చెప్పారు. ఈ ఐదు రోజుల యాత్రలో అన్ని ద్వాదశ మాధవ ఆలయాల్లో అనుష్ఠానాలు, హారతులు నిర్వహిస్తారని తెలిపారు.
పరిక్రమ యాత్రలో పాల్గొన్న అగ్ని అఖాడ సన్యాసి, ఆలయ నిర్వాహకుడు మహంత్ బీరేంద్రానంద్ మాట్లాడుతూ... చాలా కాలంగా నిలిచిపోయిన ఈ పరిక్రమ యాత్రను ఉత్తరప్రదేశ్‌లో యోగి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ప్రారంభించారన్నారు. ఔరంగజేబు కాలంలో నిలిచిపోయిన ప్రయాగరాజ్ పంచకోశి పరిక్రమలాగే ద్వాదశ మాధవ పరిక్రమ యాత్రను కూడా వారి ప్రోత్సాహంతోనే మొదలుపెట్టారని అన్నారు.
ద్వాదశ మాధవ ఆలయాల పునరుద్ధరణకు ప్రజల మద్దతు
మహా కుంభమేళాకు వచ్చే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడమే కాదు ప్రయాగరాజ్‌లోని పురాతన ఆలయాలు కూడా సందర్శిస్తారు. ఈ ఆలయాలతో పౌరాణిక విశ్వాసాలు ముడిపడి ఉన్నాయి. ఈ ఆలయాల సమూహంలో ద్వాదశ మాధవ ఆలయ సమూహం ప్రధానమైనది. వీటి అసలు నిర్మాణాన్ని కాపాడుతూ యోగి సర్కార్ వాటిని పునరుద్ధరిస్తోంది. మొత్తం 12.34 కోట్ల రూపాయలతో ఈ పురాతన ఆలయాలకు కొత్త రూపునిస్తున్నారు. దీంతో ఇవి భక్తులకు, పర్యాటకులకు మరింత ఆకర్షించనున్నాయి.
ద్వాదశ మాధవ పరిక్రమ యాత్ర ఈ పురాతన ఆలయాలను ప్రజలతో తిరిగి అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. శ్రీ చక్ర మాధవ ప్రధాన మహంత్ అవధేష్ దాస్ జీ మహారాజ్ మాట్లాడుతూ... యోగి సర్కార్ నిర్లక్ష్యానికి గురైన పౌరాణిక వారసత్వాన్ని తిరిగి నిలబెడుతున్నారని అన్నారు. ద్వాదశ మాధవ ఆలయాల అభివృద్ధికి సర్కార్ 22 లక్షలకు పైగా సహాయం అందించిందన్నారు. ఆలయాల్లో థీమ్ ఆధారిత ప్రవేశ ద్వారాలు, చిత్రలేఖనాలు, సత్సంగ్ భవనం, ఫ్లోరింగ్, తాగునీటి వసతి, ప్రహరీ గోడ, హరిత ప్రాంతాలు ఏర్పాటు చేశారు. దీంతో శిథిలావస్థకు చేరుకున్న పురాతన ఆలయాలు ఇప్పుడు తమ పూర్వ వైభవాన్ని తిరిగి పొందాయన్నారు.